ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్(ఈసీఆర్) ఫైలింగ్‌కు సంబంధించి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యుఎఎన్)తో ఆధార్ నెంబర్ లింక్ గడువును కరోనా మహమ్మారి కారణంగా పొడిగించింది. గతంలో జూన్ 1 వరకు ఉన్న యుఎఎన్ - ఆధార్ లింకింగ్ గడువును తాజాగా ఈపీఎఫ్ఓ సెప్టెంబర్ 1 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈసీఆర్ దాఖలు చేయడానికి కచ్చితంగా యూఏఎన్ నెంబర్‌తో ఆధార్ నెంబర్‌ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన అధికారులకు ఈ విషయాన్ని ఇప్పటికే తెలియజేసింది. దీంతో ఇప్పటివరకు యూఏఎన్‌తో ఆధార్ లింక్ చేయకపోయినా కూడా ఇప్పుడు ఈసీఆర్ దాఖలు చేయొచ్చు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తమ ఉద్యోగులకు ఆధార్ నెంబర్‌ను పీఎఫ్ ఖాతాలు లేదా యుఎఎన్ తో లింక్ చేయడానికి యజమానులకు ఎక్కువ సమయం లభించింది. ఈపీఎఫ్‌వో సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని సెక్షన్ 142లో కొన్ని మార్పులు చేసింది. ఈసీఆర్ దాఖలు చేసే నియమాలు, విధానంలో సవరణలు చేసింది. ఒకవేల ఆధార్ తో మీ ఖాతా లేదా యుఎఎన్ నెంబర్ లింకు చేయకపోతే మీ ఖాతాలో కంపెనీలు అందజేసే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను నిలిపివేసే అవకాశం ఉంది.
చదవండి: హోప్ ఎలక్ట్రిక్: సింగిల్ ఛార్జ్ తో 125 కి.మీ. ప్రయాణం
Comments
Please login to add a commentAdd a comment