UAN Number
-
పేరు మార్పు, ఖాతా బదిలీ చందాదారులే చేయొచ్చు
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 7.6 కోట్లకుపైగా చందాదార్లకు శుభవార్త చెప్పింది. యాజమాన్యం (కంపెనీ) నుంచి తనిఖీ లేదా ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండా ఉద్యోగులే వారి పేరు, పుట్టిన తేదీ, జాతీయత, లింగం, తల్లి/తండ్రి పేరు, జీవిత భాగస్వామి పేరు, కంపెనీలో చేరిన/రాజీనామా చేసిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో మార్చుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. అంతేగాక ఆధార్ ఓటీపీ సాయంతో ఈపీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టయితే యజమాని వద్ద పెండింగ్‌లో ఉన్న బదిలీ క్లెయిమ్ అభ్యర్థనను తొలగించి.. చందాదార్లు నేరుగా ఈపీఎఫ్ఓకు క్లెయిమ్‌ను సమర్పించవచ్చు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సేవలను శనివారం పరిచయం చేశారు. ‘2017 అక్టోబర్ 1 తర్వాత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) పొందిన సభ్యులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. 2017 అక్టోబర్ 1 కంటే ముందు యూఏఎన్ జారీ అయితే ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండా యాజమాన్యాలు ఈ వివరాలను సరిచేయవచ్చు. అటువంటి సందర్భాలలో పత్రాల ఆవశ్యకత కూడా సరళీకృతం చేశాం. ఆధార్‌తో యూఏఎన్ అనుసంధానం కాకపోతే ఏదైనా దిద్దుబాటు కోసం పత్రాలను యజమానికి భౌతికంగా సమర్పించాలి. ధ్రువీకరణ తర్వాత యాజమాన్యాలు ఆమోదం కోసం ఈపీఎఫ్ఓకు పంపాల్సి ఉంటుంది’ అని వివరించారు. సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదుల్లో దాదాపు 27 శాతం ప్రొఫైల్/కేవైసీ సమస్యలకు సంబంధించినవేనని మంత్రి తెలిపారు. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల భవిష్యనిధి సంస్థకు ఫిర్యాదులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. -
EPFO Update: ఆ 12 అంకెల నంబర్ మిస్ అయిందా?
నేటి జాబ్ మార్కెట్ చాలా వైవిధ్యంగా మారిపోయింది. ఉద్యోగులు కొత్త అవకాశాలను వెతుకుంటున్న తరుణంలో కంపెనీలు మారడం సాధారణమైపోయింది. ఈ మార్పుల మధ్య ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక మూలస్తంభంగా నిలుస్తుంది. ఉద్యోగుల వృత్తిపరమైన ప్రయాణాల్లో ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆధార్ నంబర్ మాదిరిగానే ఈపీఎఫ్‌వో వ్యవస్థలో 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది చాలా కీలకమైనది. ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడల్లా ఈ నంబర్ మారదు. ఒకసారి ఈపీఎఫ్‌వో చేరినప్పుడు దీన్ని కేటాయిస్తారు. ఈపీఎఫ్ సంబంధిత అన్ని అంశాలకు ఈ యూఏఎస్ అవసరం ఉంటుంది. అయితే కంపెనీలు మారినప్పుడు కొంత ఉద్యోగులు ఈ యూఏఎన్ నంబర్‌ను మరిచిపోతుంటారు. ఈపీఎఫ్‌కు సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ నంబర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో మరిచిపోయిన యూఏఎన్ నంబర్‌ను ఆన్లైన్లోనే సులభంగా పొందే అవకాశాన్ని ఈపీఎఫ్‌వో కల్పించింది. యూఏఎన్ ఇలా పొందండి.. ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్సైట్ (https://www.epfindia.gov.in/site_en/index.php)ను సందర్శించండి సర్వీసెస్ ట్యాబ్ కింద "ఫర్ ఎంప్లాయీస్" (For Employees) విభాగానికి వెళ్లి, "మెంబర్ UAN/ఆన్లైన్ సర్వీస్ (OCS/OTCP)" ఎంచుకోండి. తర్వాత ఓపెన్ అయ్యే కొత్త పేజీలో కుడి వైపున ఉన్న ముఖ్యమైన లింక్‌ల కింద "నో యువర్ UAN"ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా అందించి ఆపై రిక్వెస్ట్ OTPని క్లిక్ చేయండి. మీ మొబైల్‌కి వచ్చిన OTPని ధ్రువీకరించండి. తర్వాతి పేజీలో మీ పేరు, పుట్టిన తేదీ, మెంబర్ ఐడీ, ఆధార్ లేదా పాన్ నంబర్, క్యాప్చా నమోదు చేసి "షో మై UAN"పై క్లిక్ చేయండి. మీ UAN నంబర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది. -
మీరు పీఎఫ్ ఖాతాదారులా? యూఏఎన్ నెంబరు ఎలా పొందాలో తెలుసా?
ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు ఆన్లైన్లో యూఏఎన్ (యూనివర్సల్ నంబర్)ను క్రియేట్ చేసుకోవచ్చు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ప్రావిడెంట్ ఫండ్ ఖాతా సభ్యులకు కేటాయించే 12-అంకెల కోడ్. ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నెంబర్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. ఒక సంస్థ నుండి మరొక సంస్థకు ఉద్యోగం మారినపుడు, ఆ ఉద్యోగి ఐడీ నంబరు మారినట్టుగా యూఏఎన్ మారదు. అందుకే అది యూనివర్సల్ అయింది. ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా యూఏఎన్ నెంబర్ మాత్రం ఒక్కటే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సంస్థలో చేరిన సమయంలో ఉద్యోగి తప్పనిసరిగా యజమానికి తమ యూఏఎన్ నంబరును అందించాలి. అపుడు ఈఫీఎఫ్‌వో కొత్త ధ్రువీకరణ ఐడీని కేటాయిస్తుంది. ఇది ఒరిజినల్ యూఏఎన్‌తో లింక్ అవుతుంది. అలాగే ఈపీఎఫ్‌వో సేవలను పొందడానికి యూఎన్ఏ నెంబర్‌తో కేవైసీ లింక్ చేయాల్సి ఉంటుంది. యూఏఎన్‌తో మాత్రమే ఈపీఎఫ్‌వో సభ్యుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతా మేనేజ్మెంట్ సులువవుతుంది. ముఖ్యంగా బ్యాలెన్స్ చెక్, లోన్ దరఖాస్తులను సమర్పించడం లాంటివి. దీనికి ఎలాంటి భౌతిక పత్రాలు అవసరం లేకుండా ఆన్లైన్లో ఉప సంహరణ అభ్యర్థనను ఈజీగా చేసుకోవచ్చు. అయిత మొదటిసారి EPFO సైన్ అప్ చేస్తున్నప్పుడు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ప్యాన్, ఆధార్‌తోపాటు, ఉద్యోగి స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కార్డ్‌ను నమోదు చేయాలి. ఆన్లైన్లో యూఏఎన్ ఎలా పొందవచ్చు. • ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో మెంబర్ ఇ-సేవాకు లాగిన్ అవ్వాలి • ముఖ్యమైన లింక్ విభాగంలో అందుబాటులో ఉన్న “UANని యాక్టివేట్ చేయండి” ఆప్షన్‌పై క్లిక్ చేయండి • ఆధార్ ఆప్షన్ ఎంచుకుని, తదుపరి సూచలన మేరకు అవసరమైన వివరాలు నమోదు చేయండి • గెట్ ఆథరైజేషన్ పిన్ బటన్ పై క్లిక్ చేయండి.. ఇక్కడ మనం నమోదు చేసిన వివరాలను క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది • కొనసాగించడానికి అంగీకరించు చెక్‌బాక్స్‌పై క్లిక్ చేయండి • మీ అభ్యర్థనను ధృవీకరించడానికి మీ మొబైల్ల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి • UANని యాక్టివేట్ చేయండిపై క్లిక్ చేయండి. • ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు యూఏఎన్ నంబర్, పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది. -
యుఏఎన్ నెంబర్-ఆధార్ లింక్ చేయకపోతే కలిగే నష్టాలు?
ఈపీఎఫ్ ఖాతా యుఏఎన్ నెంబర్‌తో ఆధార్ ను లింక్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు 31 అని పీఎఫ్ చందాదారులు గమనించాలి. మీరు మీ యుఏఎన్ నెంబర్‌తో ఆధార్ లింక్ చేయకపోతే అప్పుడు మీకు ఈపీఎఫ్ అందించే బహుళ ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. ఇంతకు ముందు ఈ గడువు జూన్ 1 వరకు ఉండేది. కానీ, కరోనా మహమ్మారి నేపథ్యంలో గడువును ఆగస్టు 31, 2021 వరకు పొడిగించినట్లు ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఈపీఎఫ్ ఖాతా యుఏఎన్ నెంబర్‌తో ఆధార్ ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది. దీని కోసం, ఈపీఎఫ్ఓ సామాజిక భద్రత కోడ్ 2020 సెక్షన్ 142లో కొన్ని కీలక మార్పులు చేసింది.(చదవండి: పీఎఫ్ యూఎన్ నెంబర్‌తో ఆధార్ లింకు చేసుకోండి ఇలా..) ఇక నుంచి పీఎఫ్ మెంబర్లు సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఏదైనా ప్రయోజనాన్ని పొందాలంటే ఆధార్ నంబర్-యుఏఎన్ లింకింగ్ తప్పనిసరి అని పేర్కొంది. రెండింటిని లింక్ చేయనివారికి పీఎఫ్ కంట్రిబ్యూషన్ అందకపోవడమే కాదు.. ఇతర ఈపీఎఫ్ఓ సేవలు ఆగిపోతాయని సంస్థ పేర్కొంది. పెన్షన్ ఫండ్ నుంచి డబ్బు తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఉద్యోగుల లింకింగ్ పూర్తయ్యే వరకు వాళ్ల ఖాతాలో కంపెనీలు తమ కంట్రిబ్యూషన్‌ను డిపాజిట్ చేయడం వీలుపడదు.(చదవండి: సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!) ఈ ఏడాది జూన్ నుంచి ఆర్గనైజేషన్ ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్(ఈసీఆర్) దాఖలు చేసే రూల్స్ కూడా మారాయి. ఇక నుంచి ఆధార్‌తో లింక్ అయిన పీఎఫ్ ఖాతాకు మాత్రమే ఎలక్ట్రానిక్ చలాన్-కమ్ -రిటర్న్‌లను దాఖలు చేయడానికి యజమానులను అనుమతిస్తామని ఈపీఎఫ్ఓ ఇది వరకే ప్రకటించింది. పెన్షన్ ఫండ్‌కి అందించే డబ్బు కూడా అందులో పడదు. ఉద్యోగులు తమ వడ్డీని సైతం పొందలేరు. -
మీ పీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేశారా..?
పీఎఫ్ చందాదారులకు ఒక ముఖ్యమైన గమనిక. సెప్టెంబర్ 1 వరకు పీఎఫ్ ఖాతాతో ఆధార్ కార్డును లింక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేల మీరు లింకు చేయకపోతే మీకు అందించే ఈపీఎఫ్ ప్రయోజనాలు తగ్గించవచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఆధార్ కార్డును పీఎఫ్ ఖాతాతో లింక్ చేయాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. (చదవండి: మైక్రోసాఫ్ట్ యూజర్లకు అలర్ట్!) ఇంతకు ముందు, ఈపీఎఫ్ఓ ఈ గడువును జూన్ 1, 2021గా నిర్ణయించింది. ఆధార్ వెరిఫైడ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్లు(యుఏఎన్)తో పీఎఫ్ రిటర్న్ దాఖలు చేయాలని రిటైర్ మెంట్ ఫండ్ బాడీ పేర్కొంది. తాజా ఆర్డర్ అమలులో ఉండటంతో, ఇప్పుడు యజమానులు తమ ఉద్యోగుల ఆధార్ నంబర్ ను పిఎఫ్ ఖాతాలు లేదా యుఎఎన్ తో లింక్ చేయడానికి ఎక్కువ సమయం ఉంటుంది. ఓకవేళ మీరు ఆధార్‌తో లింక్ చేయకపోతే సదరు కంపెనీ జమ చేసే నగదు మీ ఖాతాలో పడదు. అందుకే వెంటనే మీ ఆధార్‌ను లింకు చేయండి చేసుకోండి. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని ఈపీఎఫ్ విడుదల చేసింది. సామాజిక భద్రత కోడ్ 2020 సెక్షన్ 142 ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. -
5 నిమిషాల్లో ఈపీఎఫ్ నెంబర్ జనరేట్ చేయడం ఎలా..?
ఈపీఎఫ్ లేదా పీఎఫ్ సభ్యులు ఇప్పుడు ఆన్ లైన్ లో యూఏఎన్ ను జనరేట్ లేదా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను జారీ చేస్తుంది. యూఏఎన్ నెంబర్‌ను శాలరీ స్లిప్ మీద చూసుకోవచ్చు. ఒకవేళ మీ శాలరీ స్లిప్ మీద యూఏఎన్ నెంబర్ లేకపోతే ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నెంబర్ పొందవచ్చు. యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. యుఎఎన్ జనరేట్ చేయడానికి ముందు మీ ఆధార్ మొబైల్ నెంబరుతో మొదట లింకు అవ్వాలి. ఎందుకంటే మీ ఆధార్ తో లింకు చేసిన మొబైల్ నెంబర్ కు ఒక సందేశం వస్తుంది. యుఏఎన్ జనరేట్ లేదా యాక్టివేట్ చేసేటప్పుడు మీరు ఆధార్ కార్డు నెంబరును దగ్గర ఉంచుకోవాలి. మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా యూఏఎన్ నెంబర్ మాత్రం ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. #ईपीएफ सदस्य इन आसान स्टेप्स का पालन करके डायरेक्ट यूएएन जेनरेट कर सकते हैं। अधिक जानकारी के लिए लिंक पर क्लिक करें: https://t.co/vMcykaXRgS#EPFO #ईपीएफओ@byadavbjp @Rameswar_Teli @PMOIndia @PIB_India @MIB_India @DDNewslive @airnewsalerts @mygovindia @PTI_News @_DigitalIndia — EPFO (@socialepfo) July 20, 2021 యూఏఎన్ నెంబర్ జనరేట్ చేయు విధానం: మొదట మీరు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ పోర్టల్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత Important Links విభాగంలో ఉన్న Direct UAN Allotment by Employees ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీరు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు, క్యాప్చాను నమోదు చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఏదైనా ప్రయివేట్ కంపెనీ, ఎస్టాబ్లిష్ మెంట్ లేదా ఆర్గనైజేషన్ లో మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే 'అవును' మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు "ఎంప్లాయిమెంట్ కేటగిరీ" ఎస్టాబ్లిష్ మెంట్ పీఎఫ్ కోడ్ నెంబరు, చేరిన తేదీ, ఐడీని ఎంచుకోవాలి. మళ్లీ ఆధార్ నెంబరు చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చిన ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. చివరగా వ్యక్తిగత వివరాలు, కెవైసీ వివరాలతో కూడిన ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అన్ని వివరాలు సరిగ్గానే ఉన్నాయా? లేదా అని చెక్ చేసుకొని రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. -
పీఎఫ్ ఖాతాలో బ్యాంక్ ఖాతా వివరాలు అప్ డేట్ చేయండి ఇలా?
ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు 3 నిమిషాల్లో మీ బ్యాంక్ ఖాతా వివరాలను యూనివర్సల్ అకౌంట్ నెంబరు(యుఎఎన్)లో సులభంగా అప్ డేట్ చేయవచ్చు. మీరు బ్యాంక్ ఖాతా వివరాలను పీఎఫ్ ఖాతాలో అప్ డేట్ చేయడం ద్వారా భవిష్యత్ లో ఎప్పుడైన నగదు ఉపసంహరించుకోవాలని అనుకున్నప్పుడు మీ ప్రాసెస్ అప్పుడు తేలిక అవుతుంది. "ఉద్యోగులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను యుఎఎన్లో సులభంగా ఎలా అప్ డేట్ చేయాలో తెలుసుకోండి" అని ఈపీఎఫ్ఓ ట్వీట్ చేసింది. Know the simple steps through which employees can easily update their Bank Account Details in UAN. #EPFO #SocialSecurity #HumHainNa #Employees #Services #पीएफ #ईपीएफओ pic.twitter.com/3xyM0deMAY — EPFO (@socialepfo) June 24, 2021 పీఎఫ్ ఖాతాలో బ్యాంకు ఖాతా వివరాలను ఎలా అప్ డేట్ చేయాలి? మీరు "యూనిఫైడ్ మెంబర్ పోర్టల్"లో "యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్"తో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు 'మ్యానేజ్ ట్యాబ్'పై క్లిక్ చేస్తే "డ్రాప్ డౌన్ మెనూ"లో ఉన్న 'కెవైసీ'ను ఎంచుకోవాలి. తర్వాత అందులో మీకు కనిపించే బ్యాంక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పేరు, ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ నమోదు చేసి ఆ తర్వాత 'సేవ్' మీద క్లిక్ చేయండి. కొత్త బ్యాంకు వివరాలను సేవ్ చేసిన తర్వాత ఇది 'ఆమోదం కొరకు కెవైసి పెండింగ్ లో ఉంది' అని చూపిస్తుంది. బ్యాంకు వివరాలు ఆమోదం పొందిన తర్వాత ఈపీఎఫ్ఓ నుంచి మీకు ఒక సందేశం వస్తుంది సంస్థ తెలిపింది. చదవండి: పీఎఫ్ విత్ డ్రా: ఐదేళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారా? -
పీఎఫ్ యూఎన్ నెంబర్ ను ఆధార్‌తో లింకు చేసుకోండి ఇలా..?
ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) శుభవార్త అందించింది. గతంలో జూన్ 1 వరకు ఉన్న ఆధార్ - పీఎఫ్ యూఎన్ నెంబర్ లింకు గడువును తాజాగా సెప్టెంబర్ 1 వరకు పొడగిస్తూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మీ పీఎఫ్ ఖాతా యూఎన్ నెంబర్ ను ఆధార్‌తో లింకు చేయకపోతే వెంటనే లింకు చేసేయండి. కొత్త నిబంధనల ప్రకారం కచ్చితంగా పీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పీఎఫ్ లో సంస్థ జమ చేసే నగదు మొత్తంపై ప్రభావం పడనుంది. ఒకవేళ ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతా ఆధార్ తో లింకు కాకపోతే యజమాని జమ చేసే నగదు మీ ఖాతాలో ఇక నుంచి జమకాదు. కాబట్టి, మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింకు చేయాలని తెలుసుకోండి. అలాగే, మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఎన్) ఆధార్‌తో లింకు చేసుకోవాలి. దీనికి సంబంధించి ఉత్తర్వులను ఈపీఎఫ్ఓ విడుదల చేసింది. సామాజిక భద్రత కోడ్ 2020లోని సెక్షన్ 142 కింద ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌ను ఆధార్‌తో లింకు చేయండి ఇలా? దశ 1: అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. దశ 2: ఇప్పుడు మేనేజ్ ట్యాబ్ కింద ఉన్న ఈ-కెవైసీ ఆప్షన్ ఎంచుకోండి. దశ 3: 'ఆధార్' అని పేర్కొన్న ట్యాబ్ ఆప్షన్ ఎంచుకోండి దశ 4: మీ పేరు, ఆధార్ కార్డు నెంబరును సరిగ్గా నమోదు చేసి 'సేవ్' మీద క్లిక్ చేయండి. దశ 5: దీని తర్వాత, మీ ఆధార్ నెంబరు యుఐడీఎఐ డేటాబేస్ తో వెరిఫై చేస్తుంది. మీ సంస్థ, యుఐడీఎఐ ద్వారా మీ కెవైసీ డాక్యుమెంట్ విజయవంతంగా ఆమోదించిన తర్వాత, ఈపీఎఫ్ ఖాతా ఆధార్ కార్డుకు లింక్ చేయబడుతుంది. చదవండి: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త! -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త!
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్(ఈసీఆర్) ఫైలింగ్‌కు సంబంధించి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యుఎఎన్)తో ఆధార్ నెంబర్ లింక్ గడువును కరోనా మహమ్మారి కారణంగా పొడిగించింది. గతంలో జూన్ 1 వరకు ఉన్న యుఎఎన్ - ఆధార్ లింకింగ్ గడువును తాజాగా ఈపీఎఫ్ఓ సెప్టెంబర్ 1 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈసీఆర్ దాఖలు చేయడానికి కచ్చితంగా యూఏఎన్ నెంబర్‌తో ఆధార్ నెంబర్‌ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన అధికారులకు ఈ విషయాన్ని ఇప్పటికే తెలియజేసింది. దీంతో ఇప్పటివరకు యూఏఎన్‌తో ఆధార్ లింక్ చేయకపోయినా కూడా ఇప్పుడు ఈసీఆర్ దాఖలు చేయొచ్చు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తమ ఉద్యోగులకు ఆధార్ నెంబర్‌ను పీఎఫ్ ఖాతాలు లేదా యుఎఎన్ తో లింక్ చేయడానికి యజమానులకు ఎక్కువ సమయం లభించింది. ఈపీఎఫ్‌వో సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని సెక్షన్ 142లో కొన్ని మార్పులు చేసింది. ఈసీఆర్ దాఖలు చేసే నియమాలు, విధానంలో సవరణలు చేసింది. ఒకవేల ఆధార్ తో మీ ఖాతా లేదా యుఎఎన్ నెంబర్ లింకు చేయకపోతే మీ ఖాతాలో కంపెనీలు అందజేసే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను నిలిపివేసే అవకాశం ఉంది. చదవండి: హోప్ ఎలక్ట్రిక్: సింగిల్ ఛార్జ్ తో 125 కి.మీ. ప్రయాణం -
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆధార్ లింక్ చేయండి?
ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతాదారులకు అలర్ట్. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన పీఎఫ్ ఖాతాదారులకు సంబంధించిన నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. కొత్త నిబంధనలు జూన్ 1, 2021 నుంచి అమలులోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం కచ్చితంగా పీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. లేకపోతే పీఎఫ్ లో జమ చేసే మొత్తంపై ప్రభావం పడనుంది. ఉద్యోగుల ఖాతాలను ఆధార్ లింకు చేసే బాధ్యతను ఈపీఎఫ్ఓ, యజమానులకు అప్పగించింది. ఒకవేళ ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతా ఆధార్ లింకు కాకపోతే యజమాని జమ చేసే నగదు మీ ఖాతాలో ఇకనుంచి జమకాదు. కాబట్టి, మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింకు చేయాలని తెలుసుకోండి. అలాగే, మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్(యుఎఎన్) ఆధార్‌తో లింకు చేసుకోవాలి. దీనికి సంబంధించి ఉత్తర్వులను ఈపీఎఫ్ఓ విడుదల చేసింది. కొత్త నియమం ఏమిటి? సామాజిక భద్రత కోడ్ 2020లోని సెక్షన్ 142 కింద ఈపీఎఫ్ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి, పీఎఫ్ ఖాతా ఆధార్‌తో లింకు చేయకపోతే లేదా యూనివర్సల్ అకౌంట్ నంబర్(యుఎఎన్) ఆధార్‌తో ధృవీకరించబడకపోతే, ఈసీఆర్(ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్) దాఖలు చేయబడదు. అంటే, ఉద్యోగులు తమ సొంత పీఎఫ్ ఖాతాలో సంస్థ యజమాని జమ చేసే వాటాను ఇక నుంచి పొందలేరు. జూన్ 1లోగా తమ ఉద్యోగుల ఖాతాలను ఆధార్‌తో లింక్ చేసి ధృవీకరించాలని ఈపీఎఫ్ఓ యజమానులందరినీ ఆదేశించింది. ఈ కొత్త నియమం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈపీఎఫ్‌ను ఆధార్‌తో లింకు చేయండి ఇలా? దశ 1: అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్( www.epfindia.gov.in) ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. దశ 2: ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేసి ఈ-కెవైసి పోర్టల్‌కు వెళ్లి యుఎఎన్ ఆధార్ లింక్ పై క్లిక్ చేయండి దశ 3: యుఎఎన్ ఖాతాలో నమోదు చేసిన మీ యుఎఎన్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. దశ 4: మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ నంబర్‌ను పొందుతారు. ఓటీపీని, 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేసి ఫారమ్‌ను సమర్పించండి. ఇప్పడు ఓటీపీ ధృవీకరణ ఎంపికపై క్లిక్ చేయండి. దశ 5: మీ ఆధార్ వివరాలను ధృవీకరించడానికి మీ ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్, మెయిల్లో ఓటీపీ వస్తుంది. ఈ ధృవీకరణ తర్వాత మీ ఆధార్ మీ పీఎఫ్ ఖాతాకు లింక్ చేయబడుతుంది. చదవండి: రూ.50 వేలు దాటేసిన బంగారం ధర -
యూఏఎన్ నంబర్ లేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా?
ఈపీఎఫ్ఓ వినియోగదారులు ఇప్పుడు యూఏఎన్ నంబర్ లేకుండానే వారి పీఎఫ్ లేదా ఈపీఎఫ్ డబ్బులను చెక్ చేసుకోనే విధంగా ఈపీఎఫ్ఓ సంస్థ కొన్ని మార్పులు చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) సభ్యులు ఇప్పుడు యూఏఎన్ నంబర్ లేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా ఈపీఎఫ్ఓ హోమ్ పేజీ(epfindia.gov.in)లో లాగిన్ అవ్వండి తర్వాత క్లిక్ హియర్ టూ నో యూవర్ పీఎఫ్ బ్యాలెన్స్ పై క్లిక్ చేయండి. epfoservices.in.epfo పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీ రాష్ట్రం, ఈపీఎఫ్ సెంటర్, ఎస్టాబ్లిష్మెంట్ కోడ్, పీఎఫ్ అకౌంట్ నంబర్, మిగతా వివరాలను నింపండి. ఇప్పడు ఐ అగ్రీ అనే బటన్ పై క్లిక్ చేయాలి. మీ కంప్యూటర్ లేదా మొబైల్ లో పీఎఫ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. యూఏఎన్ నంబర్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఈపీఎఫ్ఓ వినియోగదారులకు యూఏఎన్ నంబర్ ఉంటే. మెసేజ్ లేదా మిస్డ్ కాల్ సేవ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు ‘EPFOHO UAN' అని ఎస్ఎంఎస్ పంపడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 వద్ద మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్ లేదా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. చదవండి: మీ పేరుతో ఎవరైనా సిమ్ తీసుకున్నారో తెలుసుకోండిలా? -
ఇక సొంతంగానే యూఏఎన్: ఈపీఎఫ్ఓ
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి(ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్) సంస్థ తమ చందాదారుల కోసం కొత్త సౌకర్యాన్ని శుక్రవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్)ను ఉద్యోగులు ఇకపై సొంతంగా ఆన్లైన్లో పొందవచ్చు. ఉద్యోగాలు మారినా యూఏఎన్ ఒకటే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు యూఏఎన్‌ను పొందాలంటే తమ యాజమాన్యం ద్వారా పొందాల్సి వచ్చేది. ఇకపై ఉద్యోగులు ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ ద్వారా తామే యూఏఎన్‌ను జనరేట్ చేసుకోవచ్చు. అలాగే, 65 లక్షల పెన్షన్ ఖాతాదారులకు కూడా ఈపీఎఫ్ఓ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వారు తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌ను ఇకపై డిజీలాకర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. భవిష్య నిధి సంస్థ 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ ఈ సౌకర్యాలను ప్రారంభించారు. -
యూఏఎన్ లేకున్నా పీఎఫ్ తీసుకోవచ్చు
న్యూఢిల్లీ: భవిష్య నిధి(పీఎఫ్) నుంచి ఉపసంహరణ సమయంలో సార్వత్రిక ఖాతా సంఖ్య (యూఏఎన్) వివరాలు అందించాలన్న నిబంధనను ఉద్యోగ భవిష్య నిధి సంస్థ సరళతరం చేసింది. ఈ మినహాయింపు 2014, జనవరి 1కి ముందు విరమణ పొందిన ఉద్యోగులకే వర్తిస్తుంది. యూఏఎన్ లేనివారు పీఎఫ్ నగదు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారి ఒకరు వెల్లడించారు. నగదు సెటిల్మెంట్ సమయంలో యూఏఎన్‌ను సమర్పించడాన్ని ఈపీఎఫ్ఓ గత డిసెంబర్లో తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.