పీఎఫ్ నుంచి ఉపసంహరణ సమయంలో యూఏఎన్ వివరాలు అందించాలన్న నిబంధనను ఉద్యోగ భవిష్య నిధి సంస్థ సరళతరం చేసింది.
న్యూఢిల్లీ: భవిష్య నిధి(పీఎఫ్) నుంచి ఉపసంహరణ సమయంలో సార్వత్రిక ఖాతా సంఖ్య (యూఏఎన్) వివరాలు అందించాలన్న నిబంధనను ఉద్యోగ భవిష్య నిధి సంస్థ సరళతరం చేసింది. ఈ మినహాయింపు 2014, జనవరి 1కి ముందు విరమణ పొందిన ఉద్యోగులకే వర్తిస్తుంది.
యూఏఎన్ లేనివారు పీఎఫ్ నగదు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారి ఒకరు వెల్లడించారు. నగదు సెటిల్‌మెంట్ సమయంలో యూఏఎన్‌ను సమర్పించడాన్ని ఈపీఎఫ్‌ఓ గత డిసెంబర్‌లో తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.