పీఎఫ్ చందాదారులకు ఒక ముఖ్యమైన గమనిక. సెప్టెంబర్ 1 వరకు పీఎఫ్ ఖాతాతో ఆధార్ కార్డును లింక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేల మీరు లింకు చేయకపోతే మీకు అందించే ఈపీఎఫ్ ప్రయోజనాలు తగ్గించవచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఆధార్ కార్డును పీఎఫ్ ఖాతాతో లింక్ చేయాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. (చదవండి: మైక్రోసాఫ్ట్ యూజర్లకు అలర్ట్!)
ఇంతకు ముందు, ఈపీఎఫ్ఓ ఈ గడువును జూన్ 1, 2021గా నిర్ణయించింది. ఆధార్ వెరిఫైడ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్లు(యుఏఎన్)తో పీఎఫ్ రిటర్న్ దాఖలు చేయాలని రిటైర్ మెంట్ ఫండ్ బాడీ పేర్కొంది. తాజా ఆర్డర్ అమలులో ఉండటంతో, ఇప్పుడు యజమానులు తమ ఉద్యోగుల ఆధార్ నంబర్ ను పిఎఫ్ ఖాతాలు లేదా యుఎఎన్ తో లింక్ చేయడానికి ఎక్కువ సమయం ఉంటుంది. ఓకవేళ మీరు ఆధార్‌తో లింక్ చేయకపోతే సదరు కంపెనీ జమ చేసే నగదు మీ ఖాతాలో పడదు. అందుకే వెంటనే మీ ఆధార్‌ను లింకు చేయండి చేసుకోండి. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని ఈపీఎఫ్ విడుదల చేసింది. సామాజిక భద్రత కోడ్ 2020 సెక్షన్ 142 ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment