నేటి జాబ్ మార్కెట్ చాలా వైవిధ్యంగా మారిపోయింది. ఉద్యోగులు కొత్త అవకాశాలను వెతుకుంటున్న తరుణంలో కంపెనీలు మారడం సాధారణమైపోయింది. ఈ మార్పుల మధ్య ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక మూలస్తంభంగా నిలుస్తుంది. ఉద్యోగుల వృత్తిపరమైన ప్రయాణాల్లో ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఆధార్ నంబర్ మాదిరిగానే ఈపీఎఫ్‌వో వ్యవస్థలో 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది చాలా కీలకమైనది. ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడల్లా ఈ నంబర్ మారదు. ఒకసారి ఈపీఎఫ్‌వో చేరినప్పుడు దీన్ని కేటాయిస్తారు. ఈపీఎఫ్ సంబంధిత అన్ని అంశాలకు ఈ యూఏఎస్ అవసరం ఉంటుంది. అయితే కంపెనీలు మారినప్పుడు కొంత ఉద్యోగులు ఈ యూఏఎన్ నంబర్‌ను మరిచిపోతుంటారు. ఈపీఎఫ్‌కు సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ నంబర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో మరిచిపోయిన యూఏఎన్ నంబర్‌ను ఆన్‌లైన్‌లోనే సులభంగా పొందే అవకాశాన్ని ఈపీఎఫ్‌వో కల్పించింది.
యూఏఎన్ ఇలా పొందండి..
- ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్ (https://www.epfindia.gov.in/site_en/index.php)ను సందర్శించండి
- సర్వీసెస్ ట్యాబ్ కింద "ఫర్ ఎంప్లాయీస్" (For Employees) విభాగానికి వెళ్లి, "మెంబర్ UAN/ఆన్‌లైన్ సర్వీస్ (OCS/OTCP)" ఎంచుకోండి.
- తర్వాత ఓపెన్ అయ్యే కొత్త పేజీలో కుడి వైపున ఉన్న ముఖ్యమైన లింక్‌ల కింద "నో యువర్ UAN"ని క్లిక్ చేయండి.
- ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా అందించి ఆపై రిక్వెస్ట్ OTPని క్లిక్ చేయండి.
- మీ మొబైల్‌కి వచ్చిన OTPని ధ్రువీకరించండి.
- తర్వాతి పేజీలో మీ పేరు, పుట్టిన తేదీ, మెంబర్ ఐడీ, ఆధార్ లేదా పాన్ నంబర్, క్యాప్చా నమోదు చేసి "షో మై UAN"పై క్లిక్ చేయండి.
- మీ UAN నంబర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment