ఐటీ రిటర్నులకు తుది గడువు సమీపిస్తున్న తరుణంలో ఆదాయ పన్ను శాఖ తాజా హెచ్చరిక జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 ('చట్టం') కింద ఆదాయాన్ని తప్పుగా నివేదించడం , తప్పుడు తగ్గింపులను క్లెయిమ్ చేస్తే కఠినమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ఇందులో నేరం రుజువైతే ఏడాదికి 12 శాతం వడ్డీ, పన్ను మీద 200 శాతంజరిమానా ఉంటుందని ప్రకటించింది. జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని పీఐబీ తెలంగాణా ట్విటర్ హ్యాండిల్ ఒక ట్వీట్ షేర్ చేసింది.
ఇదీ చదవండి: ITR Filing: గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు ప్రక్రియ గడువు జులై 31తో గడువు ముగియనుంది. పన్ను చెల్లింపు దారులంతా ఐటీఆర్ ఫారంలో కచ్చితంగా సరైన వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో తప్పుడు వివారాలు సమర్పించినా, డిడక్షన్లు తప్పుగా చూపించినా, ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ, ఏపీ ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత పన్ను చెల్లింపుదారులను హెచ్చరించారు. తప్పుడు వివారాలు ఇచ్చినట్లు రుజువైతే ఏడాదికి 12 శాతం వడ్డీ, 200 శాతం పెనాల్టీ చెల్లించాలని పేర్కొన్నారు. అంతేకాదు న్యాయపరమైన చర్యలు తీసుకుంటే జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. (Foxconn: ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం: లక్షల కోట్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి)
కాగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారు పాత లేదా కొత్త విధానంలో ఒక దాన్ని ఎంపిక చేసుకుని ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్, ప్యాన్, ఫాం-16, బ్యాంకు స్టేట్ మెంట్లు, ఫారం 26 ఏఎస్, పెట్టుబడి ధ్రువపత్రాలు, రెంట్ అగ్రిమెంట్, సేల్ డీడ్, డివిడెండ్ వారంట్స్ వంటి పత్రాలు అవసరం అవుతాయన్న సంగతి తెలిసిందే.
Under the Income-tax Act,1961 (the 'Act') there are stringent consequences of misreporting of income and claiming wrongful deductions
Those include interest @ 12% /yr, penalty @ 200% of taxes, prosecution which may entail imprisonment
-Pr Chief Commissioner, @IncomeTax_APTS pic.twitter.com/2qGQwSG6op
— PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) July 10, 2023
Comments
Please login to add a commentAdd a comment