
మీరు వేతన జీవి అయినా, ఫ్రీలాన్సర్ లేదా ఇప్పుడే జాబ్ మార్కెట్లోకి ప్రవేశించినప్పటికీ, మొదటిసారి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయడం సంక్లిష్టంగా అనిపించవచ్చు. అందుకే ఆదాయపు పన్ను శాఖ తరచుగా ఐటీ రిటర్నులను సౌకర్యవంతంగా, వేగంగా దాఖలు చేయడానికి చిట్కాలు, పద్ధతులను తెలియజేస్తుంటుంది.
ఐటీఆర్ దాఖలు చేయడానికి ముందు, పన్ను చెల్లింపుదారులు ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్లో నమోదు చేసుకోవడం చాలా అవసరం. ఫైలింగ్ ప్రక్రియను సజావుగా, సౌకర్యవంతంగా చేయడానికి, ఐటీఆర్ పోర్టల్లో ఎలా నమోదు చేసుకోవాలన్నదానిపై ఆదాయపు పన్ను శాఖ వివరణాత్మక గైడ్ను షేర్ చేసింది. ఈ-పోర్టల్లో నమోదు చేసుకోవడానికి దశలవారీ గైడ్ను వివరిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది.
ఐటీఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోండిలా..
స్టెప్ 1: ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ - www.incometax.gov.in కు వెళ్లండి. హోమ్ పేజీ ఎగువ కుడి వైపు మూలలో ఉన్న 'రిజిస్టర్' బటన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 2: యూజర్ టైప్ ట్యాబ్ లో 'ట్యాక్స్ పేయర్' ఎంచుకొని 'కంటిన్యూ' క్లిక్ చేయాలి.
స్టెప్ 3: 'పాన్' ఆప్షన్లో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి 'వెలిడేట్' క్లిక్ చేయాలి. మీరు ఆధార్తో పాన్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి.
స్టెప్ 4: పాన్ వివరాలను ఇచ్చిన తర్వాత, మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డును ఎంటర్ చేసి, 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి.
స్టెప్ 5: పూర్తి పేరు, పుట్టిన తేదీ, జెండర్, నివాస స్థితితో సహా ప్రాథమిక సమాచారాన్ని అందించండి. ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత 'కంటిన్యూ' ఎంచుకోండి.
స్టెప్ 6: చెల్లుబాటులో ఉన్న కాంటాక్ట్ నెంబరు, ఈ-మెయిల్ ఐడీ, పూర్తి నివాస చిరునామా వంటి కాంటాక్ట్ వివరాలను నమోదు చేసి 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి.
స్టెప్ 7: మీరు ఇచ్చిన కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడీపై రెండు వేర్వేరు ఆరు అంకెల ఓటీపీలను మీరు అందుకుంటారు. తర్వాత మీ కాంటాక్ట్ వివరాలను ధృవీకరించి సంబంధిత ఫీల్డ్ ల్లో ఓటీపీలను నమోదు చేయండి. ఒకవేళ మీకు ఓటీపీలు రాకపోతే 'రీసెండ్ ఓటీపీ'పై క్లిక్ చేయండి
స్టెప్ 8: ఇప్పటివరకు అందించిన సమాచారం అంతటిని సమీక్షించుకుని అన్నీ సరిగ్గా ఉన్నట్లయితే 'కన్ఫర్మ్' మీద క్లిక్ చేయండి.
స్టెప్ 9: బలమైన పాస్వర్డ్ను క్రియేట్ చేసుకుని మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ను ధృవీకరించండి. తరువాత, ధృవీకరించడానికి అదే పాస్వర్డ్ను మళ్లీ నమోదు చేయండి. చివరగా, వ్యక్తిగతీకరించిన లాగిన్ సందేశాన్ని సెట్ చేయండి. మీరు ఫిషింగ్ వెబ్సైట్లో లేరని, అధికారిక ఐటీ వెబ్సైట్లో ఉన్నారని నిర్ధారించడానికి ఈ దశ సహాయపడుతుంది.
పాస్ వర్డ్ పాలసీ: కనీసం 8 క్యారెక్టర్లు, గరిష్టంగా 14 క్యారెక్టర్లు ఉండాలి. ఇందులో అప్పర్ కేస్, లోయర్ కేస్ అక్షరాలు రెండూ ఉండాలి. ఒక సంఖ్య, ఒక ప్రత్యేక అక్షరాన్ని కలిగి ఉండాలి (ఉదా. @#$%).
స్టెప్ 10: రిజిస్టర్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ ఈ-ఫైలింగ్ అకౌంట్ క్రియేట్ అయ్యి లాగిన్ పేజీకి వెళ్తారు.
New to the Income Tax Portal?
Registering on the Income Tax Portal is easy!
Here’s a quick step-by-step guide to help you register with ease.
Become a partner in nation's progress by registering now.
Visit - https://t.co/uv6KQUbXGv@nsitharamanoffc @officeofPCM @FinMinIndia… pic.twitter.com/ThzoVrS1g6— Income Tax India (@IncomeTaxIndia) August 28, 2025