‘లోకేశ్‌.. హిందుస్తాన్‌ టైమ్స్‌పై దావా వేసే దమ్ముందా?’ | Ex-Minister Perni Nani Counter Attack To Chandrababu Naidu And Lokesh - Sakshi
Sakshi News home page

లోకేశ్‌.. పాదయాత్ర తర్వాత ముందు ఐటీ నోటీసులపై స్పందించు: పేర్ని నాని కౌంటర్‌

Published Fri, Sep 1 2023 4:03 PM | Last Updated on Fri, Sep 1 2023 6:25 PM

Ex Minister Perni Nani Counter Attack To Chandrababu And Lokesh - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అడ్డదారిలో బోగస్‌ కాంట్రాక్ట్‌ల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించి తన ఖాతాలో జమ చేసుకున్నారు  చంద్రబాబు నాయుడు అవినీతి బాగోతం బట్టబయలైంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని తీవ్ర ఆరోపణలు చేశారు. 

పీఏ ద్వారానే చంద్రబాబుకు ముడుపులు..
కాగా, పేరి నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. హిందూస్తాన్‌ టైమ్స్‌ చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసింది. హిందుస్తాన్‌ టైమ్స్‌ కథనంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు. అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా? కాదా?. చంద్రబాబు గుట్టంతా ఐటీ బయటపెట్టింది. ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేస్తాడనేది బహిర్గతమైంది. 2016 నుంచీ చంద్రబాబు బాగోతం ఇప్పుడు బయటకొచ్చింది. ఇన్‌ఫ్రా సంస్థల సబ్‌ కాంట్రాక్ట్‌లతో 118 కోట్లు ముడుపులు తీసుకున్నారు. తన పీఏ శ్రీనివాస్‌ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు. రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరిగింది. ఈ ముడుపుల బాగోతంపై ఐటీ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబుకు మనోజ్‌ పార్థసాని ముడుపులు ఇచ్చినట్టు తేలింది. ఈ ముడుపులను దాచి ఉంచిన ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదు?. 

లోకేశ్‌.. ముందు నీ తండ్రి అవినీతిపై స్పందించు..
ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియా ఎందుకు స్పందించదు?. ప్రధానులు, రాష్ట్రపతులను మార్చిన చంద్రబాబుకు ఐటీ నోటీసులిస్తే రాయాలిగా?. హిందుస్తాన్‌ టైమ్స్‌లో వచ్చిన కథనం వీరెవ్వరికీ కనిపించదు. ఎన్టీఆర్‌ ఆత్మ చంద్రబాబును వెంటాడుతోంది. చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలి. ఎమ్మెల్సీ పోతుల సునీతపై నారా లోకేశ్‌ ఇష్టానుసారం మాట్లాడారు. మాటల జాగ్రత్తగా మాట్లాడండి. లోకేశ్‌ ముందు పాదయాత్ర ఆపి తన తండ్రి అవినీతిపై మాట్లాడాలి. లోకేశ్‌ ముందు నీ తండ్రి అవినీతి బాగోతంపై స్పందించు. లోకేశ్‌.. హిందుస్తాన్‌ టైమ్స్‌పై దావా వేసే దమ్ముందా? ఐటీ నోటీసులపై కూడా చంద్రబాబు స్టే తెచ్చుకుంటాడు. 

అవసరం కోసం అరచేతిలో వైకుంఠం
చంద్రబాబు, లోకేశ్‌ ప్రజల సొమ్మును అడ్డంగా తినేశారు. మళ్లీ ప్రజల సొమ్మును తినేసేందుకు అధికారం ఇవ్వాలా?. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబే. మళ్లీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ కొత్త మోసం మొదలుపెట్టారు. తప్పుడు సంతకంతో మళ్లీ ప్రజల వద్దకు బయలుదేరాడు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు. ఎవరినైనా వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు దిట్ట. అవసరం తీరే వరకు అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు’ అంటూ సెటైరికల్‌ పంచ్‌ వేశారు. 

ఇది కూడా చదవండి: ఐటీ నోటీసులు.. అడ్డంగా బుక్కైనా నోరు విప్పని చంద్రబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement