సాక్షి, తాడేపల్లి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేతికి ముట్టిన రూ.118 కోట్ల అక్రమ ధనం గురించి ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఐటీ రిటర్నుల్లో చూపని ఈ రూ.118 కోట్లనూ అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇన్‌ఫ్రా కంపెనీల నుంచి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లను లెక్క చూపని ఆదాయంగా పరిగణిస్తూ.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ఇక, ఐటీ నోటీసులపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. చంద్రబాబు అక్రమాలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి..‘అమరావతి అనేది అతిపెద్ద స్కాం. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు గారికి ముట్టిన రూ.118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివి. ఇందులో భాగస్వామి సింగపూర్ మంత్రి, చంద్రబాబు సన్నిహితుడు ఈశ్వరన్ అరెస్టయ్యాడు. CRDA ప్లానింగులో అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఇంకా లక్ష కోట్ల వ్యవహారాలు బయటకు రావాల్సి ఉంది’ అని స్పష్టం చేశారు.
‘అమరావతి’ అనేది అతిపెద్ద స్కాం. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు గారికి ముట్టిన రూ.118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివి. ఇందులో భాగస్వామి సింగపూర్ మంత్రి, చంద్రబాబు సన్నిహితుడు ఈశ్వరన్ అరెస్టయ్యాడు. CRDA ప్లానింగులో అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఇంకా లక్ష కోట్ల వ్యవహారాలు…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 2, 2023
ఇది కూడా చదవండి: చంద్రబాబు గురించి ఢిల్లీ పెద్దలకు అంతా తెలుసు: కారుమూరి వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment