బీహార్ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయపడినట్టు సమాచారం.
బీహార్ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయపడినట్టు సమాచారం. సంఘటనా స్థలం నుంచి మరో రెండు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాట్నాలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాల్గొనే సభకు మూడు గంటల ముందు బాంబు పేలడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పాట్నా రైల్వే స్టేషన్ లోని పదవ నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఓ టాయిలెట్ సమీపంలో బాంబు పేలుడు జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. గాయపడిన వారిని పాట్నా మెడికల్ ఆస్పత్రికి తరలించారు. పేలుళ్ల ఘటనను విచారిస్తున్నామని.. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఆదివారం పాట్నాలో మధ్నాహం ఒంటి గంటకు 'హుంకర్' ర్యాలీలో నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో బీజేపీతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అలయెన్స్ తెగతెంపులు చేసుకున్న తర్వాత బీజేపీ సభను నిర్వహించడం ఇదే తొలిసారి. హుంకర్ సభ ద్వారా బీహార్ లో మోడీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో బాంబు పేలుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.