పాట్నా:వచ్చే సంవత్సరం బీహార్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతోనే ముందుకు వెళతామని సీనియర్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ స్పష్టం చేశారు. తాజాగా జరిగిన మహారాష్ట్రలో, హర్యానా ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితులు వేరన్నారు. రానున్న ఎన్నికల్లో ఎల్జీపీ, ఆర్ఎల్ ఎస్ పీ లతో పొత్తుపై ఆలోచిస్తున్నామన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన సుశీల్ కుమార్.. బీజేపీ విజయంతో స్థానిక పార్టీలకు ప్రమాదం ఉందన్న వార్తలను ఆయన ఖండించారు. అందులో ఎటువంటి వాస్తవం లేదన్నారు. దేశంలోని కాంగ్రెస్ విధానాలతో అలసిపోయిన ప్రజలు బీజేపీ పట్టంకట్టారన్నారు.
మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ పోటీ చేసిన తీరును చూస్తే మాత్రం అది ఏకాకిని తలపిస్తోందన్నారు. మహారాష్ట్రలో శివసేన, హర్యానాల్లో హెచ్ జేపీ(హర్యానా జన్ హిత్ కాంగ్రెస్)లతో పొత్తు విఫలమయ్యిన తీరును ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.