
లాలుతో పెట్టుకుంటే ఇంతే మరి!
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ బాగా షార్ప్‌గా ఉంటారు. రాజకీయ సెటైర్లు వేయాలంటే ఎవరైనా ఆయన తర్వాతే. అలాంటి లాలుకు షాకివ్వాలని ప్రయత్నించిన బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీకి లాలుయే ఝలక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాల్లోను బీజేపీ తిరుగులేని విజయాలు సాధించడంతో.. నేరుగా ఆ విషయాన్ని ప్రస్తావించకుండా, 'ఎలా ఉన్నారు లాలూ' అని ఓ చిన్న ట్వీట్ చేశారు సుశీల్ మోదీ. దానికి లాలు చాలా షార్ప్‌గానే రియాక్ట్ అయ్యారు. 'నేను బాగానే ఉన్నాను. బీజేపీ నిన్ను యూపీలోకి రానివ్వలేదు. అందుకే ఆ పార్టీ అక్కడ గెలిచింది' అని సమాధానం ఇచ్చారు.
సుశీల్ మోదీ, లాలుల మధ్య ఇలా సరదా సంభాషణలు, పొలిటికల్ సెటైర్లు కొత్తేమీ కాదు. ఇంతకుముందు కూడా వీళ్లిద్దరి మధ్య ఇలాంటివి చాలానే జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సమయం నాటికి సమాజ్‌వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్‌కు, ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్‌కు మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు.. లాలుకు 'మీ కొడుకులతో జాగ్రత్త' అని సుశీల్ మోదీ చెప్పారు.
@laluprasadrjd क्या हाल है ?
— Sushil Kumar Modi (@SushilModi) 11 March 2017
ठीक बा। देखा ना, बीजेपी ने तुम्हें यूपी में नहीं घुसने दिया तो फायदा हुआ। https://t.co/KBzqOjGdzM
— Lalu Prasad Yadav (@laluprasadrjd) 11 March 2017