‘అంత బాధేస్తే నితీశ్‌కు నీ సోదరినివ్వు’ | Give sister hand to Nitish: Rabri devi to Sushil Modi | Sakshi
Sakshi News home page

‘అంత బాధేస్తే నితీశ్‌కు నీ సోదరినివ్వు’

Published Wed, Nov 30 2016 9:21 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

‘అంత బాధేస్తే నితీశ్‌కు నీ సోదరినివ్వు’

‘అంత బాధేస్తే నితీశ్‌కు నీ సోదరినివ్వు’

పాట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌ భార్య రబ్రీ దేవీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె బీజేపీ సీనియర్ నేత సుశీల్‌ కుమార్‌ మోదీని అనకూడని మాటలు అన్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ భవిష్యత్తు గురించి అంత ఆందోళన పడుతున్న సుశీల్ ఆయనను ఇంటికి తీసుకెళ్లి ఒడిలో కూర్చొబెట్టుకోవచ్చని అన్నారు. అది కాకుంటే నితీశ్‌కు సుశీల్‌ సోదరి చేయినందించి పెళ్లి చేసుకోని ఆయన ఖ్యాతిని పెంచుకోవచ్చని వివాదాస్పదంగా మాట్లాడారు.

బీజేపీలో ఉన్నప్పుడు నితీశ్‌ కుమార్‌ జీవితం చాలా అద్భుతంగా ఉందని, ఆయనకు అది ఒక స్వర్ణ యుగం అని, కానీ, ఇప్పుడు ఆర్జేడీ, కాంగ్రెస్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని అంతకుముందు రోజు సుశీల్‌ కుమార్‌ మోదీ అన్నారు. ఆ పార్టీలతో స్నేహం గురించి మరోసారి ఆలోచిస్తే మంచిదని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతిస్తూ నితీశ్ బహిరంగ ప్రకటన చేసిన అనంతరం సుశీల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే లాలూ భార్యను కొందరు మీడియా ప్రతినిధులు కలిసి స్పందన కోరగా సుశీల్‌కు నితీశ్‌ ను చూసి అంత బాధనిపిస్తే ఆయన సోదరినిచ్చి పెళ్లి చేసి ఇంటికి తీసుకెళ్లి ఒడిలో కూర్చొబెట్టుకోవచ్చని ఘాటుగా అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు మీడియాలో పలు విమర్శలకు దారి తీయడంతో తన ఉద్దేశం అది కానే కాదని, మీడియానే తన వ్యాఖ్యలను వక్రీకరించిందని చెప్పారు. సుశీల్‌ కుమార్ మోదీ తనకు మరిదిలాంటివాడని, అతడికి తాను వదినలాంటిదాన్నని, ఆ మాత్రం పరాచికాలు ఆడకూడదా అంటూ వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement