శభాష్‌... నితీశ్‌ | We are not in favour of mid-term elections in Bihar: Sushil Kumar Modi | Sakshi
Sakshi News home page

శభాష్‌... నితీశ్‌

Published Wed, Jul 26 2017 8:15 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

శభాష్‌... నితీశ్‌ - Sakshi

శభాష్‌... నితీశ్‌

నితీశ్‌ రాజీనామాపై బీజేపీ కామెంట్‌

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ కుమార్‌ రాజీనామా చేయడాన్ని బీజేపీ స్వాగతించింది. బిహార్‌లో మధ్యంతర ఎన్నికలకు తాము మొగ్గు చూపించడం లేదని ప్రకటించింది. అవినీతి విషయంలో రాజీపడకుండా సీఎం పదవికి నితీశ్‌ రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉందని బీజేపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ వ్యాఖ్యానించారు. ఆర్జేడీ ముందు మోకరిల్లనందుకు హర్షం వ్యక్తం చేశారు. బిహార్‌ భవిష్యత్‌ కార్యాచరణ కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

నితీశ్‌ రాజీనామాను బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా స్వాగతించింది. బిహార్‌లో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని స్వాగతిస్తున్నట్టు ప్రకటించింది. మధ్యంతర ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా లేదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి జేపీ నద్దా తెలిపారు. ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ అధినాయకత్వానికి నివేదిక ఇస్తుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement