
సగంమంది మంత్రులు, ఎమ్మెల్యేలూ తాగుబోతులే!
పాట్నా: 'ముఖ్యమంత్రిగారు, మీరు రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలుచేస్తున్నారు. కానీ అధికార మహా కూటమికి చెందిన సగం మంది మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం మద్యం సేవిస్తారు. ఈ నేపథ్యంలో మద్యం నిషేధం అమలులో మీ చిత్తశుద్ధి కనిపించడం లేదు' అని బిహార్ బీజేపీ సీనియర్ నేత సుశీల్‌కుమార్ మోదీ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై మండిపడ్డారు.
రాష్ట్రంలో మద్యనిషేధం అమల్లో ఉన్న ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు మందు కొడుతూ స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిన పోయిన నేపథ్యంలో సుశీల్ మోదీ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ పార్టీలతో కూడిన మహాకూటమి సంకీర్ణ ప్రభుత్వంలోని సగానికిపైగా మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం మందు తాగుతారనే విషయం తనకు తెలుసునని, ఈ నేపథ్యంలో బిహార్‌లో నితీశ్ ప్రభుత్వం సంపూర్ణంగా మద్యనిషేధం ఏమేరకు అమలుచేస్తున్నదనేది ప్రశ్నార్థకంగా మారిందని ఆయన పేర్కొన్నారు.