ఆర్‌ఎస్సెస్‌కు పోటీగా డీఎస్సెస్
ఆర్‌ఎస్సెస్‌కు పోటీగా డీఎస్సెస్
Published Mon, Apr 3 2017 12:10 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
పట్నా: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్సెస్)కు వ్యతిరేఖంగా బీహార్ వైద్యశాఖ మంత్రి, ఆర్జేడీ నేత లాలుప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ ధర్మనిర్పేక్ష సేవక్ సంఘ్ (డీఎస్సెస్) ను ఏర్పాటు చేశారు. ఆర్‌ఎస్సెస్ మతతత్వాన్ని,దేశ విభజన భావాజలాన్ని ప్రోతాహిస్తుందని, దీన్ని డీఎస్సెస్ అడ్డుకుంటందని తేజ్‌ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యానించారు. సోమవారం పట్నాలో తన మద్దతుదారులతో చేపట్టిన డీఎస్సెస్ ర్యాలీలో పాల్గొన్న తేజ్ ప్రతాప్ డీఎస్సెస్ గురించి మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాధ్ హిందూ యువవాహిని పేరుతో హిందూత్వ భావజాలన్ని బీహార్‌లోకి ప్రవేపెట్టాలనుకుంటున్నారని దీన్ని డీఎస్సెస్ సమర్దవంతంగా అడ్డుకుంటదని తెలిపారు. దేశంలో శాంతి, స్నేహపూర్వక వాతవరణాన్ని నెలకొల్పడమే డీఎస్సెస్ ముఖ్య ఉద్దేశ్యమని యాదవ్ చెప్పాడు.
డీఎస్సెస్ ఏర్పాటు చేసేముందు తేజ్‌ప్రతాప్ ఆర్‌స్సెస్‌లో చేరి ఒక సంవత్సరం పాటు పని చేయాలని సీనియర్ బీజేపీ నాయకుడు సుశీల్‌కుమార్ మోదీ సలహాఇచ్చాడు. ప్రతాప్ స్థాపించిన డీఎస్సెస్ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని సుశీల్ తెలిపాడు. కానీ కొంత అనుభవం అవసరమని దానికి ఆర్‌స్సెస్‌లో చేరి హాఫ్ ప్యాంట్లతో ‘భారత్ మతాకి జై ’అని జపం చేస్తే వస్తుందన్నాడు. దీనిపై స్సందించిన తేజ్‌ప్రతాప్ హాఫ్ ప్యాంట్లు వేసుకునే వారంతా హాఫ్ మైండ్‌గాళ్లని సుశీల్‌కు కౌంటర్ ఇచ్చాడు.
Advertisement