సాక్షి, నలంద: వివాదాస్పద అయోధ్య అంశంపై బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఆర్జేడీ గానీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గానీ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించలేవని తేజ్ ప్రతాప్ అభిప్రాయపడ్డారు. రామాలయాన్ని కేవలం హిందువులే కాదు.. ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, దళితులు, ఇతర అన్ని మతాలవారు కలిసి నిర్మిస్తారని ఆకాంక్షించారు. పార్టీలకు, మతాలకు అతీతంగా అందరూ కలిసి మందిరం ఏర్పాటు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
నలందలో తేజ్ ప్రతాప్ మీడియాతో మాట్లాడారు. అన్ని మతాల వాళ్లు అయోధ్యకు చేరుకుని ఇటుక మీద ఇటుక పేరుస్తూ రామాలయ నిర్మాణం చేపడతారని చెప్పారు. ఏ రోజైతే రామ మందిర నిర్మాణం పూర్తవుతుందో ఆరోజు బీజేపీ-ఆరెస్సెస్‌ల బంధం ముగుస్తుందని తేజ్ ప్రతాప్ జోస్యం చెప్పారు. ఆ సమయంలో వారికి ఎలాంటి అజెండాలు వదులుకుని నడుచుకుంటారని అయోధ్య వివాదం, బీజేపీ-ఆరెస్సెస్ దోస్తీపై లాలూ ప్రసాద్ తనయుడు స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment