![Tej Pratap Yadav Alleged That BJP And RSS Conspiring To kill Him - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/23/tej.jpg.webp?itok=VSZBNO4B)
తేజ్‌ప్రతాప్ యాదవ్
పట్నా: బీజేపీ, ఆరెస్సెస్‌లు కలిసి తనను చంపడానికి కుట్రపన్నాయని లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దకుమారుడు, ఆర్జేడీ యువనేత తేజ్‌ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ నుంచి తనకు ప్రాణ హాని ఉందన్నారు. బుధవారం ఆయన మహుయా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా తనను కలుసుకునేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు గుంపులుగా తరలి వచ్చారు. గుంపులో ఓ వ్యక్తి ఆయుధంతో ప్రతాప్ దగ్గరకు వచ్చారు. ఇది గమనించిన భద్రతాసిబ్బంది ఆ వ్యక్తిని దూరంగానెట్టి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసుకు అప్పజెప్పారు.
కాగా బీజేపీ, ఆరెస్సెస్‌లు కలిని తనను చంపాడానికే ఆవ్యక్తిని పంపారని తేజ్‌ఆరోపించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులకే రక్షణ లేకుండా పోయిందని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తనను చంపడానికి బీజేపీ, ఆరెస్సెస్‌లు మరికొంత మందిని పంపుతారని, భయపడేది లేదని పేర్కొన్నారు. గతంలో బీజేపీ, సీఎం నితీష్ కుమార్ కలిసి తన ఫేస్‌బుక్‌ను హాక్ చేశారనితేజ్‌ప్రతాప్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment