లాలూ ర్యాలీలో మమత, అఖిలేష్, శరద్ యాదవ్
Published Sun, Aug 27 2017 4:00 PM | Last Updated on Fri, Aug 17 2018 7:32 PM
పాట్నాః బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతను చాటేందుకు ఆదివారం ఆర్జేడీ చీఫ్ నిర్వహించిన మెగా ర్యాలీకి బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, జేడీయూ రెబెల్ నేత శరద్ యాదవ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. లాలూ ర్యాలీకి హాజరైతే కఠిన చర్యలు తప్పవని బీహార్ సీఎం నితీష్ నేతృత్వంలోని జేడీయూ హెచ్చరికలను లెక్కచేయకుండా శరద్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారు. జేడీయూ నుంచి సస్పెండ్‌అయిన రాజ్యసభ ఎంపీ అలీ అన్వర్‌తో కలిసి ఆయనర్యాలీకి హాజరయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పతనానికి ఈ ర్యాలీ నాందిపలుకుతుందని ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ పేర్కొన్నారు.
రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి సీపీ జోషీ హాజరయ్యారు. వామపక్షాల నుంచి సురవరం సుధాకర్ రెడ్డి, డీ రాజా, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్, ఎన్‌సీపీ నేత, ఎంపీ తారిఖ్ అన్వర్‌లు ర్యాలీలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement