పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ సమావేశమయ్యాయి. కాంగ్రెస్‌తో సహా దాదాపు 15కు పైగా పార్టీలకు చెందిన కీలక నేతలు ఈ సమావేశానికి హాజరైన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ సర్కార్‌ను గద్దె దించడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఓ వైపు ఎన్నికలు, మరోవైపు జాతీయ అంశాలపై సీరియస్‌గా చర్చ జరగుతున్న సమయంలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అడిగిన ప్రశ్నకు సమావేశంలో ఒక్క సారిగా నవ్వులు, జోకులు విరబూశాయి.
పెళ్లి చేసుకో రాహుల్
ప్రతిపక్ష సమావేశంలో జాతీయ అంశాలతో పాటు మరో అంశం కూడా తెరపైకి వచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో ఒకరైన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చలోకి తీసుకువచ్చారు లాలూ ప్రసాద్ యాదవ్. సమావేశంలో ఆయన రాహుల్ పెళ్లి అంశంపై తన దైనశైలిలో రెచ్చిపోయారు. ఆయన దీనిపై మాట్లాడుతూ.. ‘రాహుల్ జీ.. పెళ్లి చేసుకో.. మేము నీ పెళ్లి ఊరేగింపుకు వస్తాం” అని సలహా ఇచ్చారు. ఈ మాటలతో రాహుల్ గాంధీ సహా అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు.
అంత వరకు సీరియస్‌గా ఉన్న వాతావరణం కాస్త లాలూ వ్యాఖ్యలతో ఒక్కసారిగా మారిపోయింది. ఈ అంశంపై లాలూ కొనసాగిస్తూ.. ‘ఇంకా సమయం మించిపోలేదు, మీరు పెళ్లి చేసుకోండి. మీ అమ్మ (సోనియాగాంధీ) నాకు చెప్పేవారు.. ఈ విషయంలో నువ్వు ఆమె మాట వినడం లేదని’ ఆయన అన్నారు. వీటికి రాహుల్ గాంధీ నవ్వుతూ బదులిచ్చారు. ‘ఇప్పుడు మీరు పెళ్లి గురించి చెప్పారు కదా ఇక అది జరుగుతుందని’ రాహుల్ అన్నారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహాల్ గాంధీ తన పెళ్లి ప్రస్తావన రాగా ఈ విధంగా స్పందించారు. తన తల్లి సోనియా గాంధీ, అమ్మమ్మ మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఉన్న లక్షణాలు కలిగిన అమ్మాయి తనకు భాగస్వామిగా కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
చదవండి: 'భారత్‌లో చాలా మంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారు'.. అసోం సీఎం వ్యాఖ్యలపై రాజకీయ రగడ..
Comments
Please login to add a commentAdd a comment