పాట్నా : ‘కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మతి భ్రమించింది. వెంటనే ఆయన రాకీయాల నుంచి తప్పుకోవాలని’ అని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.
అంబేద్కర్ పేరు ప్రస్తావించడం కాంగ్రెస్‌కు ప్యాషనైందంటూ రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ‘అమిత్ షాకు మతి భ్రమించింది. బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అమిత్‌షా రగిలిపోతున్నారు. ఆయన తీరును ఖండిస్తున్నా. అంబేద్కర్ గొప్పవారు. అమిత్‌షా రాజకీయాలను వదిలేయాలి' అని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.
पगला गया है अमित शाह !
इस्तीफा देकर जल्द दे जल्द भाग जाए केंद्रीय गृह मंत्री !
संविधान रक्षक - लालू प्रसाद यादव@laluprasadrjd 🔥🔥#तड़ीपार_माफ़ी_मांग pic.twitter.com/uOaBHFBtSw— सरपंच साहेब (@sarpanchsaheb3) December 19, 2024
అంతకుముందు,బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడారు. అమిత్ షా,బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆరోపించారు. అంబేద్కర్ మా ఫ్యాషన్. మా ప్రేరణ. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఎవరు అవమానించినా మేం అంగీకరించం. అలాంటి వ్యక్తులు ద్వేషాల్ని రగిల్చే వారు. రాజ్యాంగ వ్యతిరేకులు,పార్లమెంటులో ఉపయోగించిన భాష ఆమోదించదగిన అంశం కాదు.
రాజ్యంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో రెండు రోజుల చర్చకు ఆయన బదులిచ్చారు. ఆ సందర్భంగా కాంగ్రెస్‌ను విమర్శిస్తూ అంబేద్కర్ ప్రస్తావన తెచ్చారు. అంబేద్కర్, అంబేద్కర్ అనడం వాళ్లకు ఇప్పుడో ఫ్యాషనైపోయింది. అన్నిసార్లు దైవనామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల దాకా స్వర్గమన్నా దక్కేది’ అంటూ ఎద్దేవా చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలను డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్ వెలుపల నిరసన చేపట్టాయి. ఆ నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార, విపక్ష ఎంపీల మధ్య జరిగిన తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment