రబ్రీ, తేజస్వి యాదవ్‌లను ప్రశ్నించిన ఐటీ
న్యూఢిల్లీః ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అవినీతి కేసులపై సీబీఐ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా తాజాగా ఆదాయపన్ను శాఖ ఆయనను టార్గెట్ చేసింది. బినామీ ఆస్తులు కలిగిఉన్నారనే ఆరోపణలపై ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌ను మంగళవారం ఐటీ అధికారులు గంటన్నరపైగా విచారించారు. ఈ సందర్భంగా వీరిని పలు అంశాలపై ప్రశ్నించినట్టు సమాచారం.
పాట్నాలో రబ్రీ, తేజస్వీలను ఐటీ అధికారుల బృందం ప్రశ్నించింది. జూన్ 22న ఇదే కేసులో లాలూ కుమార్తె మిసా భారతిని ఐటీ అధికారులు దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించారు.