
ఇకపై లాలూ ట్వీట్లు
పాట్నా: ‘‘ఈ ఐటీ, వైటీతో ఏమవుతుంది’’ అని చెప్పే ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌లో కూడా మార్పు వచ్చింది. ఎప్పుడూ సాధారణ దేశవాళీ యాసతో, కట్టుతో కనిపించే లాలూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రచారాన్ని కల్పించే సామాజిక అనుసంధాన వెబ్‌సైట్ల ఆవశ్యకత గుర్తించారు. ఆయన ట్విట్టర్‌లో మంగళవారం ఖాతా తెరిచారు. ట్విట్టర్.కామ్/లాలూప్రసాద్‌ఆర్‌జేడీలో ఆయన్ను అనుసరించవచ్చు.
‘‘మార్పు మాత్రమే స్థిరమైనది. మార్పుతోనే మనం కూడా మారతాం. ట్విట్టర్‌లో ఖాతా తెరిచాను’’ అని తొలి సందేశంలో లాలూ పేర్కొన్నారు. మనందరి లక్ష్యమైన మంచి భవిష్యత్ కోసం సమష్టిగా కృషి చేద్దామని మరో ట్వీట్ చేశారు. తొలి రోజు ఆయన్ను 68 మంది నెటిజన్లు అనుసరించారు.