‘మత’ కోటా కోరింది నితీశ్, లాలూనే: మోదీ | Pm modi on nithish and lalu | Sakshi
Sakshi News home page

‘మత’ కోటా కోరింది నితీశ్, లాలూనే: మోదీ

Published Mon, Nov 2 2015 3:46 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

‘మత’ కోటా కోరింది నితీశ్, లాలూనే: మోదీ - Sakshi

‘మత’ కోటా కోరింది నితీశ్, లాలూనే: మోదీ

కతిహార్/మధుబని: ఇప్పటికే తీవ్రస్థాయిలో రగులుకున్న రిజర్వేషన్ల తేనెతుట్టెను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కదిపారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ 2005లో డిమాండ్ చేశారన్నారు. అసలు ఆ సమయంలో ఒకరి ముఖం మరొకరు చూసుకోనంతగా బద్ధశత్రువులుగా ఉన్న వారిద్దరూ... మత ప్రాతిపాదికన రిజర్వేషన్లపై మాత్రం ఏకమయ్యారని విమర్శించారు. ఆదివారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కతిహార్, మధుబనిల్లో నిర్వహించిన ర్యాలీల్లో మోదీ ప్రసంగించారు.

అంబేడ్కర్, నెహ్రూ, వల్లభాయ్‌పటేల్ వంటి గొప్పవారు వ్యతిరేకించిన ‘మత రిజర్వేషన్లను’..  అమలు చేయాలని నితీశ్, లాలూ వంటివారు కోరారని.. ఇప్పుడేమో తమకు మతం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీకి కూడా ప్రస్తుత రిజర్వేషన్ల విధానాన్ని మార్చేందుకు అధికారం లేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement