సైకిల్‌పై తేజ్‌ ప్రతాప్‌, ఐశ్వర్యరాయ్‌.. వైరల్‌ | Tej Pratap Yadav And Aishwarya Rais Bicycle Ride Viral | Sakshi
Sakshi News home page

Published Thu, May 17 2018 8:58 AM | Last Updated on Thu, May 17 2018 1:48 PM

Tej Pratap Yadav And Aishwarya Rais Bicycle Ride Viral - Sakshi

పట్నా : ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పెళ్లి ఈ నెల 12న పట్నాలో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్‌ రాయ్‌ మనవరాలు ఐశ్వర్యరాయ్‌తో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ నవదంపతులు కలిసి దిగిన కొన్ని ఫొటోలు ఇప్పుడు ఇంటర్‌ నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఐశ్వర్యను ముందు కుర్చోబెట్టుకుని  సైకిల్‌ తొక్కుతున్న ఫొటోను తేజ్‌ ప్రతాప్‌ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది.

అలాగే పెళ్లిలో లాలు కుటుంబ సభ్యులు కలిసి చేసిన డ్యాన్స్‌ వీడియోలు బయటికి వచ్చాయి.  పెళ్లి తర్వాత నూతన దంపతులను తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ తల్లి, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబరీ దేవి గుడికి కూడా తీసుకువెళ్లారు. ఐశ్వర్య, తేజ్‌ ప్రతాప్‌ పెళ్లి ఫోటోలను, వీడియోలను బిహార​ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేశారు. పెళ్లికి వచ్చి వధువరులను ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే పెళ్లికి లక్షల్లో జనాలు వస్తారని ముందే అంచనా వేసి గాంధీ మైదానం లాంటి ప్రదేశంలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయినా ఏమైన అసౌకర్యం కలిగి ఉంటే క్షమించమంటూ కూడా పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement