కపిల్ షో నుంచి సిద్ధూ ఎందుకు తప్పుకున్నాడు? | Navjot Singh Sidhu quits The Kapil Sharma Show | Sakshi
Sakshi News home page

కపిల్ షో నుంచి సిద్ధూ ఎందుకు తప్పుకున్నాడు?

Published Wed, Sep 21 2016 6:37 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

కపిల్ షో నుంచి సిద్ధూ ఎందుకు తప్పుకున్నాడు?

కపిల్ షో నుంచి సిద్ధూ ఎందుకు తప్పుకున్నాడు?

ముంబై: కపిల్ శర్మ కామెడీ నైట్ షో అభిమానులకు నిరాశ కలిగించే వార్త. కామెడీ ‘గురు' నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నాడు. అక్టోబర్ నుంచి ఈ షోలో అతడు కనిపించడు. ఈ విషయాన్ని సిద్ధూ సతీమణి నవజ్యోత్ కౌర్ ధ్రువీకరించారు. పంజాబ్ రాజకీయాలపై ఆయన దృష్టిసారించాలనుకుంటున్నారని వెల్లడించారు. అక్టోబర్ 1న అమృతసర్ చేరుకుని తన సొంత పార్టీ ఆవాజ్-ఏ-పంజాబ్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తారని చెప్పారు.

‘పంజాబ్ రాజకీయాలపై పూర్తి సమయం వెచ్చించాలన్న ఉద్దేశంతో కపిల్ శర్మ కామెడీ షో నుంచి సిద్ధూ తప్పుకుంటున్నారు. సెప్టెంబర్ 30 వరకు ఎపిసోడ్ల షూటింగ్ పూర్తి చేశారు. తనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నంటున్న వారందరికీ సిద్ధూ వీడ్కోలు చెప్పేశార’ని నవ్యజోత్ కౌర్ తెలిపారు. పార్టీకి పూర్తి సమయం వెచ్చించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్ మొదలు పెడుతున్న సిద్ధూకు అభిమానులు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement