కాంగ్రెస్‌లోకి సిద్ధూ భార్య | Navjot Singh Sidhu's Wife Navjot Kaur To Formally Join Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి సిద్ధూ భార్య

Published Thu, Nov 24 2016 8:37 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

కాంగ్రెస్‌లోకి సిద్ధూ భార్య

కాంగ్రెస్‌లోకి సిద్ధూ భార్య

న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన మాజీ క్రికెటర్‌ సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ ఈ నెల 28న కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఆమెతో పాటు ఆవాజ్‌–ఎ–పంజాబ్‌ నేత పర్గత్‌ సింగ్‌ కూడా తమ పార్టీలో చేరతారని పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ తెలిపారు. సిద్ధూ కూడా వీరి బాటలోనే నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యే బీజేపీ నుంచి బయటకు వచ్చిన సిద్ధూ ఆవాజ్‌–ఎ–పంజాబ్‌ పార్టీని స్థాపించడం తెలిసిందే.

కౌర్‌ కూడా భర్త బాటలోనే నడిచారు. ఇటీవలే బీజేపీకి ఆమె రాజీనామా చేశారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. సొంతంగా పోటీ బరిలోకి దిగాలని మొదట సిద్ధూ భావించారు. అయితే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం సరిపోదన్న ఆలోచనతో ఆయన వెనక్కు తగ్గారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తో ఆయన చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ తరపున ఆయన ముఖ్య ప్రచారకుడిగా వ్యవహరిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement