Punjab polls
-
పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకోగలదా..?
-
అధికార కూటమి తుడిచిపెట్టుకుపోయింది!
పంజాబ్‌లో బీజేపీ-అకాలీకి చుక్కెదురు యూపీలో కాంగ్రెస్-ఎస్పీకి అదే పరిస్థితి ఎగ్జిట్ పోల్ అంచనాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో అధికార కూటములకు ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. పంజాబ్‌లో అధికార శిరోమణి అకాలీ దళ్-బీజేపీ కూటమి దారుణంగా ఓడిపోతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అధికార కూటమి ఇక్కడ అట్టర్ ఫ్లాప్ కాబోతున్నదని ఇండియా టుడే, ఇండియా న్యూస్, ఇండియా టీవీ అంచనా వేశాయి. అటు యూపీలో సమాజ్‌వాదీ-కాంగ్రెస్ కూటమికి కూడా అనుకున్న ఫలితాలు రావని, మరోసారి అధికారంలోకి రావాలన్న అఖిలేశ్ యాదవ్ కల నెరబోరదని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. 403 స్థానాలు ఉన్న యూపీలో మరోసారి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి అఖిలేశ్ యాదవ్ హోరాహోరీగా ప్రచారం సాగించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీతో కలిసి ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ లక్ష్యంగా పోటాపోటీ విమర్శలతో విరుచుకుపడ్డారు. అటు అఖిలేశ్ సతీమని డింపుల్ యాదవ్, కాంగ్రెస్ యువనాయకురాలు ప్రియాంక గాంధీ సైతం ప్రచారంలో మెరిశారు. అయినప్పటికీ అనుకున్న ఫలితాలు అఖిలేశ్ కూటమి దూరంగానే నిలిచిపోతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. దాదాపు అన్ని సర్వేలు యూపీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని, హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేశాయి. ఇక ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి 110-130 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ-వీమ్మార్ అంచనా వేయగా, ఆ కూటమికి 120 స్థానాలు వస్తాయని ఇండియా న్యూస్-యాక్సెస్, 135-147 స్థానాలు వస్తాయని ఇండియా టీవీ-సీవోటర్ సర్వేలు పేర్కొన్నాయి. ఒక్క ఏబీపీ న్యూస్ సర్వే మాత్రమే ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి కొద్దిగా ఎక్కువమొత్తంలో 161 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఈ అంచనాల ప్రకారం చూసుకుంటే మళ్లీ అధికారంలోకి రావాలన్న ఎస్పీ-కాంగ్రెస్ కలలు నెరవేరే అవకాశం అంతగా కనిపించడం లేదు. ఇక పంజాబ్‌లో అధికార అకాలీ-బీజేపీ కూటమి చిత్తుగా ఓడిపోతుందని దాదాపు అన్ని సర్వేలు ఘంటాపథంగా చెప్పాయి. మాజీ సీఎం అమరిందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటూ అంచనా వేశాయి. తొలిసారి పోటీచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గణనీయమైనరీతిలో సీట్లు సాధించే అవకాశముందని పేర్కొన్నాయి. విశేషమేమిటంటే.. ఇండియా టుడే, ఇండియా న్యూస్, ఇండియా టీవీ సర్వేలు అకాలీ-బీజేపీ కూటమి తుడిచిపెట్టుకుపోతుందని, ఆ కూటమికి పదిలోపు స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశాయి. ఈ కూటమికి ఇండియా టుడే 4-7 స్థానాలు వస్తాయని చెప్పగా, ఇండియా న్యూస్ 7 స్థానాలు, ఇండియా టీవీ 3 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఒక్క చాణక్య మాత్రమే అధికార కూటమికి 45-63 స్థానాలు వస్తాయంటూ ఊరట కలిగించే అంచనాలు వెల్లడించింది. -
ఎగ్జిట్ పోల్స్: పంజాబ్‌లో పంజా విసిరేది ఈ పార్టీయే!
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటబోతున్నదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనా వేశాయి. పంజాబ్ లో తొలిసారి పోటీచేసిన ఆప్ కూడా గణనీయమై స్థానాలు సాధించే అవకాశముందని తేల్చాయి. ఇక అధికార శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమి పంజాబ్‌లో దారుణంగా చతికిలపడనుందని అంచనా వేశాయి. హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 62-71 స్థానాలు దక్కనున్నాయని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే తేల్చింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 42-51 స్థానాలు సాధించనుందని తెలిపింది. ఇక అధికార శిరోమణి అకాలీ దళ్-బీజేపీ కూటమికి కేవలం 4 నుంచి 7 సీట్లు మాత్రమే ఈ సర్వే తేల్చింది. మూక్కోణపు పోరు నెలకొన్న పంజాబ్‌లో అధికార ఎస్ఏడీ-బీజేపీకి చావుదెబ్బ తగలనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 117 స్థానాలు ఉన్న పంజాబ్ ఎన్నికలకు సంబంధించి వివిధ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈవిధంగా ఉన్నాయి. చానెల్ అకాలీ-బీజేపీ కాంగ్రెస్ ఆప్ ఇతరులు ఇండియా న్యూస్ 7 55 55 0 ఇండియా టుడే 4-7 62-71 42-51 0 చాణక్య వీఎమ్మార్ -
పంజాబ్‌లో 48 చోట్ల రీపోలింగ్
చండీగఢ్: ఈ నెల 4న పంజాబ్ పోలింగ్ సమయంలో ఓటర్ వెరిఫైడ్ ఆడిట్ పేపర్ ట్రేల్(వీవీపీఏటీ) ఈవీఎం యంత్రాలు మెరాయించిన 48 కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఫిబ్రవరి 9న ఈ పోలింగ్ మాజితా, ముక్త్సర్, సంగ్రూర్ నియోజక వర్గాల్లో జరుగుతుంది. అలాగే మాక్ పోల్స్ సందర్భంగా పోలైన ఓట్లను ఈవీఎంలు చూపిన మోగా, సర్దుల్‌గఢ్ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ జరుగుతుంది. పంజాబ్‌లో ఈసీ తొలిసారి వీవీపీఏటీని 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 6668 పోలింగ్ కేంద్రాల్లో, అమృత్సర్ లోక్‌సభ స్థానం పరిధిలోని రెండు సెగ్మెంట్లలో ఉపయోగించింది. ఓటింగ్ యంత్రాల్లో నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా మాజితాలో 25 కేందాల్లో, సంగ్రూర్, ముక్త్సర్లలో పదేసి కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యమైంది. దీనిపై నివేదిక సమర్పించాలని ఈసీ పంజాబ్ ఎన్నికల అధికారులను ఆదేశించింది. -
‘ఉగ్రవాద శక్తులకు సీఎం మద్దతు’
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై రాహుల్‌గాంధీ మండిపాటు సంగ్రూర్ (పంజాబ్): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ’కొన్నిరోజుల కిందట బాంబు పేలుళ్లు జరిగాయి. ఆరుగురు చనిపోయారు. ఆ పేలుళ్లకు కారణమైన శక్తులకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు పలుకుతున్నారు. వాళ్లను మళ్లీ నిలబెట్టాలని చూస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సంగ్రూర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మాజీ మిలిటెంట్ నివాసంలో బస చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాద, మిలిటెంట్ శక్తులు గతంలో పంజాబ్‌ను నాశనం చేశారని, హింసాయుత చర్యలకు పాల్పడ్డారని, ఇప్పుడే అవే శక్తులు మరోసారి తెరపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, వారికి కేజ్రీవాల్ అండగా నిలబడుతున్నారని రాహుల్ ఆరోపించారు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న అకాలీదళ్-బీజేపీ కూటమి ప్రజాసంక్షేమం కన్నా సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నదని ఆరోపించారు. -
‘పంజాబీలు సింగ్ నే కోరుకుంటున్నారు’
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీదే విజయమని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అమరీందర్ సింగ్ దీమా వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆశలు ఫలించవని చెప్పారు. బాదల్ ప్రభుత్వం రాష్టాన్ని సర్వనాశసనం చేసిందని ధ్వజమెత్తారు. ‘ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని కేజ్రీవాల్ భావిస్తున్నారు. అలా జరగదు. ఎందుకంటే పంజాబీలు సింగ్ నే కోరుకుంటున్నారు. అకాలీల దుష్ప్రరిపాలన కారణంగా రాష్ట్రంలో అవినీతి పెరిగింది. పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది. రైతులు ఆత్మహత్యలు పెరిగాయి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్రంపై సీఎం బాదల్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. మేము అధికారంలో వస్తే నాలుగు వారాల్లో డ్రగ్స్ మాఫియా పనిపడతాం. ఇదంతా ఎవరు నడిపిస్తున్నారో మాకు తెలుసు’ అని అమరీందర్ సింగ్ అన్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే అని ప్రశ్నించగా.. గెలవని ఎన్నికల్లో తానెప్పుడూ పోటీ చేయలేదని సమాధానమిచ్చారు. -
చౌక ధరకే పెట్రోల్!
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరనూ తగ్గిస్తాం విద్యుత్ బిల్లుల్లో కోత పెడతాం పంజాబ్ ఓటర్లకు మరిన్ని వరాలు కురిపించిన అమరిందర్ సింగ్ జలంధర్: రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పెట్రోల్ చౌక ధరకు అందిస్తామని ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు అమరిందర్ సింగ్ ప్రకటించారు. ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా తగ్గిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బిల్లులను పదిశాతం మేర తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పంజాబ్ మ్యానిఫెస్టోను విడుదల చేసినప్పటికీ.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈమేరకు అదనపు వరాలను అమరిందర్ గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం జోరుగా ప్రచారం చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్ సిటిజన్లకు, విద్యార్థులకు రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. అదనంగా మాజీ సైనికులు, పోలీసులు, పారామిలిటరీ బలగాలకు కూడా బస్సులలో ఉచిత ప్రయాణాన్ని అందిస్తామన్నారు. పంజాబ్‌లోని అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని.. తాము మ్యానిఫెస్టోను ఈ మేరకు విస్తరించబోతున్నామని, ప్రజలకు మరింత సంక్షేమాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. -
కెప్టెన్ అమరీందర్ సింగ్ నామినేషన్
-
కేజ్రీవాల్.. దమ్ముంటే పోటీకి రా!
-
కేజ్రీవాల్.. దమ్ముంటే పోటీకి రా!
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరిందర్ సింగ్ విరుచుకుపడ్డారు. దమ్ముంటే ఆయన లంబి నియోజకవర్గంలో పోటీకి రావాలని సవాల్ చేశారు. పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ సొంత నియోజకవర్గమైన లంబితోపాటు తన నియోజకవర్గంలోనూ అమరిందర్ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, లంబిలో సీఎం బాదల్ విజయాన్ని సుగమం చేసేందుకు అమరిందర్ బరిలోకి దిగారంటూ కేజ్రీవాల్ విమర్శలు చేశారు. ఈ విమర్శలు కొట్టిపారేసిన అమరిందర్ సింగ్ దమ్ముంటే లంబి బరిలోకి కేజ్రీవాల్ కూడా దిగి.. తమపై పోటీ చేయాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సొంతంగానే పంజాబ్ ఎన్నికల్లో గెలుస్తుందని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. సీఎం అభ్యర్థి విషయంలో కొత్తగా పార్టీలో చేరిన నవజ్యోత్ సింగ్ సిద్ధుతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని ఆయన స్ప ష్టం చేశారు. -
సీఎం, డిప్యూటీ సీఎం స్థానాలు ఖరారు
చండీగఢ్: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీల్లో హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు ఎక్కడెక్కడి నుంచి బరిలోకి దిగుతారనే దానిపై స్పష్టత వస్తోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్.. లాంబీ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్.. జలాలాబాద్ స్థానం నుంచి పోటీ చేయనున్నారని అకాళీదల్ పార్టీ గురువారం వెల్లడించింది. పంజాబ్, గోవాల్లో ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 11న పంజాబ్, గోవా ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలతో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. -
కాంగ్రెస్‌లోకి సిద్ధూ భార్య
న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన మాజీ క్రికెటర్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆమెతో పాటు ఆవాజ్–ఎ–పంజాబ్ నేత పర్గత్ సింగ్ కూడా తమ పార్టీలో చేరతారని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ తెలిపారు. సిద్ధూ కూడా వీరి బాటలోనే నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యే బీజేపీ నుంచి బయటకు వచ్చిన సిద్ధూ ఆవాజ్–ఎ–పంజాబ్ పార్టీని స్థాపించడం తెలిసిందే. కౌర్ కూడా భర్త బాటలోనే నడిచారు. ఇటీవలే బీజేపీకి ఆమె రాజీనామా చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. సొంతంగా పోటీ బరిలోకి దిగాలని మొదట సిద్ధూ భావించారు. అయితే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం సరిపోదన్న ఆలోచనతో ఆయన వెనక్కు తగ్గారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో ఆయన చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ తరపున ఆయన ముఖ్య ప్రచారకుడిగా వ్యవహరిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. -
పంజాబ్ బరికి మరో జాబితా ప్రకటించిన ఆప్
చండీగడ్: వచ్చే పంజాబ్ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ మూడో జాబితాను ప్రకటించింది. ఈసారి ప్రకటించిన జాబితాలో 29మంది అభ్యర్థులను పేర్కొంది. ఈ తాజా జాబితాలో ప్రముఖ జర్నలిస్టు, రాజకీయనాయకుడు కన్వర్ సంధు కూడా ఉన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత సుఖ్ పాల్ సింగ్ కైరా, రెజ్లర్ కర్తార్ సింగ్ వంటి ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఇంచార్జీ సంజయ్ సింగ్ ఈ జాబితాను ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అంసెంబ్లీకి 61మంది అభ్యర్థులను ఆమ్ ఆద్మీ ప్రకటించినట్లయింది. తొలి జాబితాలో 19 మందిని ప్రకటించిన ఆప్ రెండో జాబితాలో 13మందిని తాజాగా 29మందిని ప్రకటించింది.