సీఎం, డిప్యూటీ సీఎం స్థానాలు ఖరారు | Parkash Badal to contest from Lambi assembly constituency | Sakshi
Sakshi News home page

సీఎం, డిప్యూటీ సీఎం స్థానాలు ఖరారు

Published Thu, Jan 5 2017 5:58 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

Parkash Badal to contest from Lambi assembly constituency

చండీగఢ్‌: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో ప్రధాన పార్టీల్లో హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు ఎక్కడెక్కడి నుంచి బరిలోకి దిగుతారనే దానిపై స్పష్టత వస్తోంది. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌.. లాంబీ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌.. జలాలాబాద్‌ స్థానం నుంచి పోటీ చేయనున్నారని అకాళీదల్‌ పార్టీ గురువారం వెల్లడించింది.

పంజాబ్, గోవాల్లో ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 11న పంజాబ్, గోవా ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలతో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement