ఎగ్జిట్‌ పోల్స్‌: పంజాబ్‌లో పంజా విసిరేది ఈ పార్టీయే! | punjab elections exti polls result | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్‌ పోల్స్‌: పంజాబ్‌లో పంజా విసిరేది ఈ పార్టీయే!

Published Thu, Mar 9 2017 6:14 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

punjab elections exti polls result


న్యూఢిల్లీ:
పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటబోతున్నదని ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు అంచనా వేశాయి. పంజాబ్‌ లో తొలిసారి పోటీచేసిన ఆప్‌ కూడా గణనీయమై స్థానాలు సాధించే అవకాశముందని తేల్చాయి. ఇక అధికార శిరోమణి అకాలీదళ్‌-బీజేపీ కూటమి పంజాబ్‌లో దారుణంగా చతికిలపడనుందని అంచనా వేశాయి. హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు  62-71 స్థానాలు దక్కనున్నాయని ఇండియా టుడే-యాక్సిస్‌ సర్వే తేల్చింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)  42-51 స్థానాలు సాధించనుందని తెలిపింది.

ఇక అధికార శిరోమణి అకాలీ దళ్‌-బీజేపీ కూటమికి కేవలం 4 నుంచి 7 సీట్లు మాత్రమే ఈ సర్వే తేల్చింది. మూక్కోణపు పోరు నెలకొన్న పంజాబ్‌లో అధికార ఎస్‌ఏడీ-బీజేపీకి చావుదెబ్బ తగలనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. 117 స్థానాలు ఉన్న పంజాబ్‌ ఎన్నికలకు సంబంధించి  వివిధ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఈవిధంగా ఉన్నాయి.

చానెల్‌ అకాలీ-బీజేపీ కాంగ్రెస్‌ ఆప్‌ ఇతరులు
ఇండియా న్యూస్‌ 7 55 55 0
ఇండియా టుడే 4-7 62-71 42-51 0
చాణక్య        
వీఎమ్మార్‌        

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement