యూపీలో హంగ్‌.. అయినా ఆధిపత్యం ఆ పార్టీదే! | single largest party in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో హంగ్‌.. అయినా ఆధిపత్యం ఆ పార్టీదే!

Published Thu, Mar 9 2017 6:34 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

యూపీలో హంగ్‌.. అయినా ఆధిపత్యం ఆ పార్టీదే! - Sakshi

యూపీలో హంగ్‌.. అయినా ఆధిపత్యం ఆ పార్టీదే!

అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడించాయి. చాలావరకు ఎగ్జిట్‌ పోల్స్‌ యూపీలో హంగ్‌ అసెంబ్లీ తప్పదని తేల్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాబోదని అంచనా వేశాయి. అయితే, అత్యధిక స్థానాలు గెలుపొంది.. అతిపెద్ద పార్టీగా నిలువబోయేది బీజేపీయేనని ఎగ్జిట్‌ పోల్స్ అంచనా వేశాయి.

ఇండియా న్యూస్‌-ఎమ్మార్సీ సర్వే ఫలితాల ప్రకారం చూసుకుంటే 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీజేపీకి 185 సీట్లు, అధికార సమాజ్‌వాదీ-కాంగ్రెస్‌ కూటమికి 120 సీట్లు, బీఎస్పీకి 90 సీట్లు వస్తాయని అంచనా వేసింది. యూపీలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 202. ఈ సర్వే ప్రకారం చూసుకుంటే బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచినా.. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కింగ్‌ మేకర్‌గా నిలిచే అవకాశముంది.

ఇక టైమ్స్‌ నౌ-వీఎమ్మార్‌ సర్వే ప్రకారం చూసుకుంటే బీజేపీకి 190-210 స్థానాలు, ఎస్పీ-కాంగ్రెస్‌కు 110-130 స్థానాలు, బీఎస్పీకి 57-74 స్థానాలు వచ్చే అవకాశముందని అంచనా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement