exti polls
-
గోవాలో గెలుపెవరిదంటే..
న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ దక్కబోదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేస్తున్నాయి. న్యూస్ ఎక్స్-ఎమ్మార్సీ సర్వే ప్రకారం 40 స్థానాలున్న గోవాలో బీజేపీకి 15 స్థానాలు, కాంగ్రెస్‌కు 10 స్థానాలు, ఆప్‌కు 7 స్థానాలు, ఇతరులకు 6 స్థానాలు దక్కనున్నట్టు అంచనా వేసింది. గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యే అవకాశముందని, ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో ఆప్, ఇతరులు కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. బహుముఖ పోటీ నెలకొన్న గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురువారం సాయంత్రం వెలువడ్డాయి. చానెల్ బీజేపీ కాంగ్రెస్ ఆప్ ఇతరులు ఇండియా న్యూస్ 15-21 12-18 0-4 2-8 ఇండియా టీవీ 10 15 7 8 ఇండియా టుడే యాక్సిస్ 18-22 9-13 0-2 5-9 వీఎమ్మార్ -
అధికార కూటమి తుడిచిపెట్టుకుపోయింది!
పంజాబ్‌లో బీజేపీ-అకాలీకి చుక్కెదురు యూపీలో కాంగ్రెస్-ఎస్పీకి అదే పరిస్థితి ఎగ్జిట్ పోల్ అంచనాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో అధికార కూటములకు ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. పంజాబ్‌లో అధికార శిరోమణి అకాలీ దళ్-బీజేపీ కూటమి దారుణంగా ఓడిపోతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అధికార కూటమి ఇక్కడ అట్టర్ ఫ్లాప్ కాబోతున్నదని ఇండియా టుడే, ఇండియా న్యూస్, ఇండియా టీవీ అంచనా వేశాయి. అటు యూపీలో సమాజ్‌వాదీ-కాంగ్రెస్ కూటమికి కూడా అనుకున్న ఫలితాలు రావని, మరోసారి అధికారంలోకి రావాలన్న అఖిలేశ్ యాదవ్ కల నెరబోరదని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. 403 స్థానాలు ఉన్న యూపీలో మరోసారి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి అఖిలేశ్ యాదవ్ హోరాహోరీగా ప్రచారం సాగించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీతో కలిసి ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ లక్ష్యంగా పోటాపోటీ విమర్శలతో విరుచుకుపడ్డారు. అటు అఖిలేశ్ సతీమని డింపుల్ యాదవ్, కాంగ్రెస్ యువనాయకురాలు ప్రియాంక గాంధీ సైతం ప్రచారంలో మెరిశారు. అయినప్పటికీ అనుకున్న ఫలితాలు అఖిలేశ్ కూటమి దూరంగానే నిలిచిపోతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. దాదాపు అన్ని సర్వేలు యూపీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని, హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేశాయి. ఇక ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి 110-130 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ-వీమ్మార్ అంచనా వేయగా, ఆ కూటమికి 120 స్థానాలు వస్తాయని ఇండియా న్యూస్-యాక్సెస్, 135-147 స్థానాలు వస్తాయని ఇండియా టీవీ-సీవోటర్ సర్వేలు పేర్కొన్నాయి. ఒక్క ఏబీపీ న్యూస్ సర్వే మాత్రమే ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి కొద్దిగా ఎక్కువమొత్తంలో 161 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఈ అంచనాల ప్రకారం చూసుకుంటే మళ్లీ అధికారంలోకి రావాలన్న ఎస్పీ-కాంగ్రెస్ కలలు నెరవేరే అవకాశం అంతగా కనిపించడం లేదు. ఇక పంజాబ్‌లో అధికార అకాలీ-బీజేపీ కూటమి చిత్తుగా ఓడిపోతుందని దాదాపు అన్ని సర్వేలు ఘంటాపథంగా చెప్పాయి. మాజీ సీఎం అమరిందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటూ అంచనా వేశాయి. తొలిసారి పోటీచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గణనీయమైనరీతిలో సీట్లు సాధించే అవకాశముందని పేర్కొన్నాయి. విశేషమేమిటంటే.. ఇండియా టుడే, ఇండియా న్యూస్, ఇండియా టీవీ సర్వేలు అకాలీ-బీజేపీ కూటమి తుడిచిపెట్టుకుపోతుందని, ఆ కూటమికి పదిలోపు స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశాయి. ఈ కూటమికి ఇండియా టుడే 4-7 స్థానాలు వస్తాయని చెప్పగా, ఇండియా న్యూస్ 7 స్థానాలు, ఇండియా టీవీ 3 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఒక్క చాణక్య మాత్రమే అధికార కూటమికి 45-63 స్థానాలు వస్తాయంటూ ఊరట కలిగించే అంచనాలు వెల్లడించింది. -
యూపీలో హంగ్.. అయినా ఆధిపత్యం ఆ పార్టీదే!
అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడించాయి. చాలావరకు ఎగ్జిట్ పోల్స్ యూపీలో హంగ్ అసెంబ్లీ తప్పదని తేల్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాబోదని అంచనా వేశాయి. అయితే, అత్యధిక స్థానాలు గెలుపొంది.. అతిపెద్ద పార్టీగా నిలువబోయేది బీజేపీయేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియా న్యూస్-ఎమ్మార్సీ సర్వే ఫలితాల ప్రకారం చూసుకుంటే 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీజేపీకి 185 సీట్లు, అధికార సమాజ్‌వాదీ-కాంగ్రెస్ కూటమికి 120 సీట్లు, బీఎస్పీకి 90 సీట్లు వస్తాయని అంచనా వేసింది. యూపీలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 202. ఈ సర్వే ప్రకారం చూసుకుంటే బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచినా.. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కింగ్ మేకర్‌గా నిలిచే అవకాశముంది. ఇక టైమ్స్ నౌ-వీఎమ్మార్ సర్వే ప్రకారం చూసుకుంటే బీజేపీకి 190-210 స్థానాలు, ఎస్పీ-కాంగ్రెస్‌కు 110-130 స్థానాలు, బీఎస్పీకి 57-74 స్థానాలు వచ్చే అవకాశముందని అంచనా వేసింది. -
ఎగ్జిట్ పోల్స్: పంజాబ్‌లో పంజా విసిరేది ఈ పార్టీయే!
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటబోతున్నదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనా వేశాయి. పంజాబ్ లో తొలిసారి పోటీచేసిన ఆప్ కూడా గణనీయమై స్థానాలు సాధించే అవకాశముందని తేల్చాయి. ఇక అధికార శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమి పంజాబ్‌లో దారుణంగా చతికిలపడనుందని అంచనా వేశాయి. హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 62-71 స్థానాలు దక్కనున్నాయని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే తేల్చింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 42-51 స్థానాలు సాధించనుందని తెలిపింది. ఇక అధికార శిరోమణి అకాలీ దళ్-బీజేపీ కూటమికి కేవలం 4 నుంచి 7 సీట్లు మాత్రమే ఈ సర్వే తేల్చింది. మూక్కోణపు పోరు నెలకొన్న పంజాబ్‌లో అధికార ఎస్ఏడీ-బీజేపీకి చావుదెబ్బ తగలనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 117 స్థానాలు ఉన్న పంజాబ్ ఎన్నికలకు సంబంధించి వివిధ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈవిధంగా ఉన్నాయి. చానెల్ అకాలీ-బీజేపీ కాంగ్రెస్ ఆప్ ఇతరులు ఇండియా న్యూస్ 7 55 55 0 ఇండియా టుడే 4-7 62-71 42-51 0 చాణక్య వీఎమ్మార్