
పంజాబ్ బరికి మరో జాబితా ప్రకటించిన ఆప్
చండీగడ్: వచ్చే పంజాబ్ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ మూడో జాబితాను ప్రకటించింది. ఈసారి ప్రకటించిన జాబితాలో 29మంది అభ్యర్థులను పేర్కొంది. ఈ తాజా జాబితాలో ప్రముఖ జర్నలిస్టు, రాజకీయనాయకుడు కన్వర్ సంధు కూడా ఉన్నారు.
అలాగే, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత సుఖ్ పాల్ సింగ్ కైరా, రెజ్లర్ కర్తార్ సింగ్ వంటి ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఇంచార్జీ సంజయ్ సింగ్ ఈ జాబితాను ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అంసెంబ్లీకి 61మంది అభ్యర్థులను ఆమ్ ఆద్మీ ప్రకటించినట్లయింది. తొలి జాబితాలో 19 మందిని ప్రకటించిన ఆప్ రెండో జాబితాలో 13మందిని తాజాగా 29మందిని ప్రకటించింది.