Navjot Singh Sidhu wife
-
కాంగ్రెస్‌లోకి సిద్ధూ భార్య
న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన మాజీ క్రికెటర్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆమెతో పాటు ఆవాజ్–ఎ–పంజాబ్ నేత పర్గత్ సింగ్ కూడా తమ పార్టీలో చేరతారని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ తెలిపారు. సిద్ధూ కూడా వీరి బాటలోనే నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యే బీజేపీ నుంచి బయటకు వచ్చిన సిద్ధూ ఆవాజ్–ఎ–పంజాబ్ పార్టీని స్థాపించడం తెలిసిందే. కౌర్ కూడా భర్త బాటలోనే నడిచారు. ఇటీవలే బీజేపీకి ఆమె రాజీనామా చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. సొంతంగా పోటీ బరిలోకి దిగాలని మొదట సిద్ధూ భావించారు. అయితే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం సరిపోదన్న ఆలోచనతో ఆయన వెనక్కు తగ్గారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో ఆయన చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ తరపున ఆయన ముఖ్య ప్రచారకుడిగా వ్యవహరిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. -
మా ఆయన పార్టీని వీడరు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు పార్టీ మారుతారంటూ వచ్చిన వార్తలను ఆయన భార్య, బీజేపీ ఎమ్మెల్యే నవ్‌జ్యోత్ కౌర్ సిద్ధు తోసిపుచ్చారు. తన భర్త బీజేపీని వీడరని స్పష్టం చేశారు. బీజేపీ సీనియర్ నేతలను నిరంతరం సంప్రదిస్తున్నారని కౌర్ చెప్పారు. వేరే పార్టీ నేతలను కలిసే ఆలోచన సిద్ధుకు లేదని ఆయన భార్య తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏ నాయకుడితోనూ ఆయన సమావేశం కాలేదని చెప్పారు. సిద్ధును రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసే విషయాన్ని బీజేపీ పరిశీలిస్తుందా అన్న ప్రశ్నకు పార్టీ ఏ పదవి ఇచ్చినా బాధ్యతగా పనిచేస్తారని అన్నారు. సిద్ధు ఆప్‌లో చేరే అవకాశముందని ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో కౌర్ స్పందించారు.