మా ఆయన పార్టీని వీడరు | Navjot Sidhu, will not leave BJP, says wife, denies any AAP meeting | Sakshi
Sakshi News home page

మా ఆయన పార్టీని వీడరు

Published Wed, Mar 9 2016 8:34 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మా ఆయన పార్టీని వీడరు - Sakshi

మా ఆయన పార్టీని వీడరు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ నేత నవ్జ్యోత్ సింగ్ సిద్ధు పార్టీ మారుతారంటూ వచ్చిన వార్తలను ఆయన భార్య, బీజేపీ ఎమ్మెల్యే నవ్జ్యోత్ కౌర్ సిద్ధు తోసిపుచ్చారు. తన భర్త బీజేపీని వీడరని స్పష్టం చేశారు. బీజేపీ సీనియర్ నేతలను నిరంతరం సంప్రదిస్తున్నారని కౌర్ చెప్పారు.

వేరే పార్టీ నేతలను కలిసే ఆలోచన సిద్ధుకు లేదని ఆయన భార్య తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏ నాయకుడితోనూ ఆయన సమావేశం కాలేదని చెప్పారు. సిద్ధును రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసే విషయాన్ని బీజేపీ పరిశీలిస్తుందా అన్న ప్రశ్నకు పార్టీ ఏ పదవి ఇచ్చినా బాధ్యతగా పనిచేస్తారని అన్నారు. సిద్ధు ఆప్లో చేరే అవకాశముందని ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో కౌర్ స్పందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement