ఊహాగానాల నడుమ సిద్ధు భార్య కూడా...! | Navjot Singh Sidhu wife resigned from the BJP | Sakshi
Sakshi News home page

ఊహాగానాల నడుమ సిద్ధు భార్య కూడా...!

Published Sat, Oct 8 2016 6:51 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

ఊహాగానాల నడుమ సిద్ధు భార్య కూడా...! - Sakshi

ఊహాగానాల నడుమ సిద్ధు భార్య కూడా...!

న్యూఢిల్లీ: క్రికెటర్‌, రాజకీయ నాయకుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధు దారిలోనే సాగుతూ ఆయన భార్య నవజోత్‌ కౌర్‌ సిద్ధు కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను బీజేపీ ఆమోదించింది.

బీజేపీకి ఇటీవల సిద్ధు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నామినేటెడ్‌ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన.. ఆ పదవికి రాజీనామా చేసి.. ఆ తర్వాత కమలానికి గుడ్‌బై చెప్పారు. ఈ నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీలో సిద్ధు చేరవచ్చునని ఊహాగానాలు వచ్చాయి. అయితే, తనకు భజనచేసే వ్యక్తులను కేజ్రీవాల్‌ పార్టీలోకి చేర్చుకుంటున్నారని చెప్తూ ఆయన సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆవాజ్‌ ఏ పంజాబ్‌ పేరిట ఓ వేదికను ఏర్పాటు చేసిన ఆయన.. కాంగ్రెస్‌ పార్టీలో చేరాలంటూ వచ్చిన ఆఫర్‌ను కూడా తిరస్కరించారు.

మొదట ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పిన సిద్ధు.. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మళ్లీ రాజకీయంగా పావులు కదుపుతున్నారు. ఆప్‌లో సిద్ధు చేరవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి సిద్ధు భార్య రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement