Asia Games 2023- న్యూఢిల్లీ: ట్రయల్స్ లేకుండా ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు మినహాయింపు పొందిన మహిళా స్టార్ రెజ్లర్, డిఫెండింగ్ చాంపియన్ వినేశ్ ఫొగాట్ తాజాగా ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకొంది. మోకాలు గాయం వల్ల హాంగ్జౌ ఈవెంట్‌లో పాల్గొనడం లేదని మంగళవారం ఆమె ప్రకటించింది. దీంతో మినహాయింపు అనుచితమంటూ కోర్టుకెక్కిన అంతిమ్ పంఘాల్‌కు 53 కేజీల కేటగిరీలో లైన్ క్లియరైంది.
ఆ విభాగంలో ట్రయల్స్‌లో నెగ్గి ఆసియా ఈవెంట్‌కు అర్హత సంపాదించినప్పటికీ... వినేశ్ బరిలో ఉండటం వల్ల ఆమె స్టాండ్‌బైగా కూర్చోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వినేశ్ తనంతట తానుగా తప్పుకోవడంతో ఇక ఏ గొడవా లేకుండా అంతిమ్ ఆసియా క్రీడల్లో పాల్గొననుంది.
‘పసిడి’ ఆశలు ఆవిరి
‘ట్రెయినింగ్‌లో ఎడమ మోకాలుకు గాయమైంది. స్కానింగ్‌లో గాయం తీవ్రత దృష్ట్యా సర్జరీ తప్పనిసరని వైద్యులు సూచించడంతో ఈ నెల 17న ముంబైలో ఆపరేషన్ చేయించుకుంటాను. దీనివల్ల జకార్తా ఆసియా క్రీడల్లో (2018) సాధించిన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలనుకున్న నా ఆశలు ఆవిరయ్యాయి’ అని వినేశ్ వాపోయింది.
రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులపై వినేశ్, భజరంగ్, సాక్షి మాలిక్ తదితరులు పలుమార్లు జంతర్‌మంతర వద్ద నిరసనకు దిగారు. డబ్లూఎఫ్‌ఐ అడ్‌హక్ కమిటీ వినేశ్, భజరంగ్‌లకు నేరుగా ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశమివ్వడం వివాదానికి కారణమైంది. దీనిపై ట్రయల్స్ గెలిచిన అంతిమ్ కోర్టును ఆశ్రయించింది.
చదవండి: కలలు నిజమైన వేళ: వాళ్లు మెరిశారు..! ఇక అందరి దృష్టి అతడిపైనే..
Comments
Please login to add a commentAdd a comment