గ్రేట్ ఖలీ కాలు పెట్టగానే.. టయోటా ఫార్చ్యూనర్‌ ఫసక్‌! వైరల్‌ వీడియో | Watch: Great Khali Tries To Get Into Toyota Fortuner Breaks Footboard Video Viral On Social Media - Sakshi
Sakshi News home page

Great Khali Viral Video: గ్రేట్ ఖలీ కాలు పెట్టగానే.. టయోటా ఫార్చ్యూనర్‌ ఫసక్‌! వైరల్‌ వీడియో

Published Mon, Oct 2 2023 5:31 PM | Last Updated on Mon, Oct 2 2023 6:36 PM

Great Khali Tries To Get Into Toyota Fortuner Breaks Footboard Viral Video - Sakshi

Viral Video: అత్యంత ప్రసిద్ధ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్లలో ఒకరైన ది గ్రేట్‌ ఖలీ (Great Khali) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ టైటిల్‌ గెలిచిన ఏకైక భారతీయ సంతతి వ్యక్తి ఆయన. 2007లో ఈ టైటిల్‌ సాధించారు. డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సభ్యుడైన ఖలీని నేషనల్‌ హీరోగా భావిస్తుంటారు.

డ్రైవింగ్‌ను కూడా ఆస్వాదించే గ్రేట్ ఖలీ పలు మోడళ్ల కార్లు, బైక్‌లను నడుపుతుంటాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో తరచుగా పోస్ట్ చేస్తుంటాడు. అలాంటి వీడియో ఒకటిప్పడు వైరల్‌గా మారింది. బాగా పాపులర్‌ అయిన టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) ఎస్‌యూవీలోకి ఖలీ ఎక్కుతున్న వీడియో అది. 

టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలోకి ఎక్కేందుకు గ్రేట్‌ ఖలీ కాలు పెట్టాడు అంతే... దాని ఫుట్‌బోర్డ్‌ ఒక్కసారిగా విరిగిపోయింది. భారీ, బలిస్టమైన శరీరం ఉన్న ఖలీ ధాటికి ఆ ఎస్‌యూవీ తట్టుకోలేక పోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజెన్లు వామ్మో.. గ్రేట్‌ ఖలీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియో సరదాగా తీసిందా లేక నిజంగా  జరిగిందా అనేది కచ్చితంగా తెలియలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement