Toyota Fortuner
-
గ్రేట్ ఖలీ కాలు పెట్టగానే.. టయోటా ఫార్చ్యూనర్ ఫసక్! వైరల్ వీడియో
Viral Video: అత్యంత ప్రసిద్ధ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్లలో ఒకరైన ది గ్రేట్ ఖలీ (Great Khali) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన ఏకైక భారతీయ సంతతి వ్యక్తి ఆయన. 2007లో ఈ టైటిల్ సాధించారు. డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సభ్యుడైన ఖలీని నేషనల్ హీరోగా భావిస్తుంటారు. డ్రైవింగ్‌ను కూడా ఆస్వాదించే గ్రేట్ ఖలీ పలు మోడళ్ల కార్లు, బైక్‌లను నడుపుతుంటాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో తరచుగా పోస్ట్ చేస్తుంటాడు. అలాంటి వీడియో ఒకటిప్పడు వైరల్‌గా మారింది. బాగా పాపులర్ అయిన టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) ఎస్‌యూవీలోకి ఖలీ ఎక్కుతున్న వీడియో అది. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలోకి ఎక్కేందుకు గ్రేట్ ఖలీ కాలు పెట్టాడు అంతే... దాని ఫుట్‌బోర్డ్ ఒక్కసారిగా విరిగిపోయింది. భారీ, బలిస్టమైన శరీరం ఉన్న ఖలీ ధాటికి ఆ ఎస్యూవీ తట్టుకోలేక పోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజెన్లు వామ్మో.. గ్రేట్ ఖలీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియో సరదాగా తీసిందా లేక నిజంగా జరిగిందా అనేది కచ్చితంగా తెలియలేదు. View this post on Instagram A post shared by Car Reels India (@carreelsindia) -
Viral Video: గన్‌తో బెదిరించి రూ.30లక్షల కారు ఎత్తుకెళ్లారు
-
Live Video: గన్‌తో బెదిరించి రూ.30లక్షల కారు ఎత్తుకెళ్లారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహా నగరంలో దొంగలు రెచ్చిపోయారు. తెల్లవారుజామునే జాతీయ రహదారిపై తుపాకులతో బెదిరించి రు.30లక్షలకుపైగా విలువైన ఎస్యూవీ కారును ఎత్తుకెళ్లారు ముగ్గురు దుండగులు. అంతా చూస్తుండగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 5.19 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల రాహుల్ అనే వ్యక్తి తన ఎస్యూవీ ఫార్చునర్ కారులో ఢిల్లీకి వచ్చారు. ఈ క్రమంలో ఝరేరా గ్రామంలో జాతీయ రహదారి-8పై రోడ్డు పక్కన కారును నిలిపారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకడు తుపాకీ చూపించి బెదిరించాడు. మిగిలిన ఇద్దరు సైతం తుపాకులతో హల్చల్ చేశారు. కారును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు రాహుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 397, 34 ప్రకారం ఢిల్లీ కంటోన్మెంట్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: అగ్నితో చెలగాటమా? దెబ్బకు ముఖం కాలిపోయిందిగా..! -
షాకింగ్: కారు నడిపిన ఎనిమిదేళ్ల బాలుడు.. రోడ్డుపై రయ్యిమంటూ
రోడ్లపై వాహనాన్ని నడపాలంటే తప్పకుండా నిర్ణీత వయసు కలిగి ఉండాలి. అంతేగాక డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. భారత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. అయితే మైనర్లకు డ్రైవింగ్ అప్పజెప్పడం చట్టరిత్యా నేరం. ఈ క్రమంలో తాజాగా ఓ ఎనిమిదేళ్ల బాలుడు ఏకంగా కారును నడుపుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ షాకింగ్ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. భారత్‌లోలాగే పాకిస్థాన్‌లో కూడా 18 ఏళ్లు నిండిన వారికి డ్రైవింగ్ లైసెన్స్ అనుమతి ఉంది. కానీ సియాల్ కోటకు చెందిన 8 ఏళ్ల బాలుడు నిబంధనలు అతిక్రమిస్తూ రోడ్డుపై టోయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని నడుపుతూ కనిపించాడు. వీడియోలోని బాలుడిని ఆయాన్‌గా గుర్తించారు. ఈ బాలుడు ఆరేళ్లనుంచే కారు డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో తన పదేళ్ల అక్క కారు ముందు నిల్చొని మొదట అయాన్ డ్రైవింగ్ స్కిల్స్‌ను వివరించింది. తరువాత అయాన్ ఒక్కడే కారు డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని సీటు బెల్టు పెట్టుకోకుండానే రహదారిపై కారు నడుపుతున్నాడు. బుడ్డోడు ఎత్తు తక్కువగా ఉండటంతో సీటు అంచున కూర్చోని డ్రైవ్ చేస్తున్నాడు. రోడ్డుపై కొన్ని వాహనాలు అతడి పక్కనుంచి ఓవర్టేక్ చేయడం చూడవచ్చు. అంతేగాక పిల్లవాడు కారు నడుపుతున్నంత సేపు వాడి కళ్లల్లో ఎలాంటి భయం, బెరుకు కనిపించలేదు. చదవండి: దొంగల తెలివి...ఏటీఎం మిషన్నే తవ్వేందుకు యత్నం: వీడియో వైరల్ ఈ వీడియోను ‘అయాన్ అండ్ అరీబా’ అనే యూట్యూబ్ చానల్లో ఏప్రిల్ 1న పోస్టు చేశారు. ‘ఎనిమిదేళ్ల బాలుడు టొయోటా ఫార్చ్యూనర్‌ను ఎలా నడుపుతాడో ఈ రోజు మీకు చూపిస్తాం’ అని క్యాప్షన్‌తో అప్లోడ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయాన్ డ్రైవింగ్‌ను చూసిన చాలామంది నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొంతమంది ఆ అబ్బాయి తల్లిదండ్రులపై మండిపడుతున్నారు. పిల్లలకు డ్రైవింగ్ ఇవ్వడం ద్వారా ఇతరుల ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన చట్టవిరుద్ధం, బాధ్యతారాహిత్యమైనది, ప్రమాదకరమైనదని, ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటివి ప్రోత్సహించకూడదని కామెంట్ చేస్తున్నారు. చదవండి: రష్యా చమురు డిపోలో అగ్ని ప్రమాదం: వీడియో వైరల్ -
లాలు ప్రసాద్ అల్లుడి కారు చోరీ
ఢిల్లీ శివార్లలో లాలూ ప్రసాద్ అల్లుడు వినీత్ యాదవ్ కి చెందిన కారును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. సంచలనం కలిగించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినీత్ యాదవ్ కు చెందిన టొయోటా ఫార్చూనర్ కారు బుధవారం ఢిల్లీ నుంచి గుర్గావ్ వైపు వెళుతుండగా.. సికందర్పూర్ మెట్రో స్టేషన్ వద్ద సాయుధ దుండగులు.. కారును అడ్డగించి.. డ్రైవర్ ను కారునుంచి బయటికి లాగి.. కారును ఎత్తుకెళ్లారని తెలిపారు. దుండగుల వద్ద అత్యాధునిక తుపాకులు ఉన్నట్లు డ్రైవర్ హరి ప్రకాశ్ పేర్కొన్నాడు. కారును హైజాక్ చేసిన సమయంలో వినీత్ యాదవ్ కారులో లేరని అసిస్టెంట్ కమిషనర్ హవా సింగ్ వివరించారు. కాగా... వినీత్ ఫిర్యాదు మేరకు ఆయుధ చట్టం , కారు చోరీ కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.