లాలు ప్రసాద్ అల్లుడి కారు చోరీ | Lalu Prasad's Son-In-Law car was Snatched At Gurgaon | Sakshi
Sakshi News home page

లాలు ప్రసాద్ అల్లుడి కారు చోరీ

Published Thu, Feb 4 2016 3:41 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

లాలు ప్రసాద్ అల్లుడి కారు చోరీ - Sakshi

లాలు ప్రసాద్ అల్లుడి కారు చోరీ

ఢిల్లీ శివార్లలో లాలూ ప్రసాద్ అల్లుడు వినీత్ యాదవ్ కి చెందిన కారును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. సంచలనం కలిగించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినీత్ యాదవ్ కు చెందిన టొయోటా ఫార్చూనర్ కారు బుధవారం ఢిల్లీ నుంచి గుర్గావ్ వైపు వెళుతుండగా.. సికందర్‌పూర్ మెట్రో స్టేషన్ వద్ద సాయుధ దుండగులు.. కారును అడ్డగించి.. డ్రైవర్ ను కారునుంచి బయటికి లాగి.. కారును ఎత్తుకెళ్లారని తెలిపారు. దుండగుల వద్ద అత్యాధునిక తుపాకులు ఉన్నట్లు డ్రైవర్ హరి ప్రకాశ్ పేర్కొన్నాడు.


కారును హైజాక్ చేసిన సమయంలో వినీత్ యాదవ్ కారులో లేరని అసిస్టెంట్ కమిషనర్ హవా సింగ్ వివరించారు. కాగా... వినీత్ ఫిర్యాదు మేరకు ఆయుధ చట్టం , కారు చోరీ కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement