Anchor Suma Kanakala Escaped From Accident In Jayamma Panchayathi Shooting, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Anchor Suma: సుమకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. . వీడియో వైరల్‌

Published Sat, May 7 2022 1:03 PM | Last Updated on Sat, May 7 2022 1:31 PM

Anchor Suma Kanakala Narrow Escape From Accident  - Sakshi

యాంకర్‌ సుమకు తృటితో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది  ఇప్పుడు కాదు.. ఆమె  ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగింది. షూటింగ్‌ నిమిత్తం ఆమె ఓ అడవిలో  ఉన్న చిన్న నీటి ప్రవాహం వద్ద నిలబడింది. అక్కడ ఉన్న రాళ్లు పీచు పట్టి ఉండడంతో కాలు జారి కిందపడింది. తనను తాను కంట్రోల్‌ చేసుకొని వెంటనే లేచి బయటకు వచ్చేసింది.

(చదవండి: సరికొత్త కాన్సెఫ్ట్‌తో నయనతార కొత్త చిత్రం?)

దీనికి సంబంధించిన వీడియోని తాజాగా సుమ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్‌ చేస్తూ.. తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘జాగ్రత్త సుమక్క.. మీకేమైనా అయితే ప్రీరిలీజ్‌ ఈవెంట్స్‌, ప్రొడక్షన్స్‌ టీమ్స్‌కి.. టోటల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఇబ్బంది’. అంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

ఇక జయమ్మ పంచాయితీ సినిమా విషయాకొస్తే.. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఓ గ్రామీణ కథ ఇది. వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మించిన‌ ఈ చిత్రానికి విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.  మే 6న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement