బుల్లితెర పాపులర్ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది సుమ. తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
(చదవండి: హాలీడే మూడ్‌లో చిరంజీవి.. శ్రీజ, ఉపాసన స్వీటెస్ట్ కామెంట్)
తన చేతిపై ఉన్న పంచబొట్టు సీక్రెట్‌ని కూడా రిలీల్ చేశారు. చేతిపై ‘వెంకన్న’అని పచ్చబొట్టు వేయించుకున్నారు సుమ. ఆ పేరు వెనక ఉన్న సీక్రెట్ ఏంటని అడిగితే.. సినిమా చూస్తే తెలుస్తుందని చెప్పారు. సెకండాఫ్‌లో ఆ పేరు ఎందుకు వేయించుకున్నానో అందరికి తెలుస్తుందని సుమ చెప్పుకొచ్చారు. ఇక రాజీవ్ కనకాలతో సినిమా చేసే అవకాశం ఉందా అని అడగ్గా.. మంచి కథలు దొరికితే కచ్చితంగా చేస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment