
పవన్ బాసంశెట్టి, యుక్తి తరేజ, నాగశౌర్య, సుధాకర్ చెరుకూరి
‘‘సుధాకర్‌గారు, నేను ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలనుకున్నాం. పవన్ చెప్పిన ‘రంగబలి’ కథ మా ఇద్దరికీ నచ్చడంతో ఈ మూవీ చేశాం. చాలా నమ్మకంగా చెబుతున్నాను.. ‘రంగబలి’తో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం’’ అని హీరో నాగశౌర్య అన్నారు. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి యాంకర్ సుమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నాగశౌర్య మాట్లాడుతూ–‘‘ఇప్పటి వరకూ సుధాకర్‌గారికి వచ్చిన లాభాల కంటే ‘రంగబలి’ కి వచ్చే లాభాలు ఎక్కువగా ఉంటాయి. ‘రంగబలి’తో పవన్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నాగశౌర్య హీరోయిజం, ఎమోషన్ కొత్తగా చూస్తారు. సుధాకర్‌గారు ఎక్కడ రాజీపడకుండా తీశారు’’ అన్నారు పవన్ బాసంశెట్టి. ‘‘రంగబలి’ టీమ్‌తో పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను’’ అన్నారు యుక్తి తరేజ. ‘‘రంగబలి’ పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్స్ కిషోర్ తిరుమల, శ్రీకాంత్ ఓదెల.
Comments
Please login to add a commentAdd a comment