
రోడ్డు భద్రతా ఉద్యమంలో మేము సైతం
సాక్షి,సిటీబ్యూరో: రోడ్డు భద్రతా ఉద్యమంలో తాము కూడా భాగస్వాములమవుతామని, రవాణాశాఖ కార్యక్రమాలకు మద్దతునిస్తామని సినీనటుడు రాజీవ్ కనకాల,ఆయన సతీమణి యాంకర్ సుమ అన్నారు. గురువారం డ్రైవింగ్ లెసైన్స్ రెన్యువల్ కోసం వారు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రాంతీయ రవాణా అధికారులు దశరథం, జీపీఎన్ ప్రసాద్ వారిని సాదరంగా ఆహ్వానించి ఇద్దరి డ్రైవింగ్ లెసైన్సుల రెన్యువల్ ప్రక్రియను ముగించారు.