యాంకర్ సుమ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. టీవీ ఉన్న ప్రతి ఇంటివారికి ఆమె చుట్టమే. దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెరపై మకుటం లేని మహారాణిలా ఏలుతోంది. ఎలాంటి షో అయినా, ప్రోగ్రామ్ అయినా సుమ ఉండే చాలు హిట్టయినట్లే. అంతలా ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని క్రియేట్ చేసుకుంది సుమ.
ఇక బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ యాంకరమ్మ. ఫన్నీ వీడియోలతో పాటు వంట వీడియోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేయడంతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటుంది.
ఇక కరోనా లాక్‌డౌన్ వల్ల మరింత ఫ్రీ దొరకడంతో సోషల్ మీడియాలో దూకుడు పెంచేసింది. కరోనా భయంలో అల్లాడుతున్న ప్రజలకు తన వీడియోల ద్వారా ధైర్యాన్ని అందిస్తోంది. ఇప్పటికే పలు వీడియో ద్వారా కరోనా జాగ్రత్తలు చెప్పిన సుమ.. తాజాగా తన భర్త రాజీవ్ కనకాల డైలాగ్ చెప్పి ప్రజలకు ధైర్యాన్ని నూరిపోసింది.
నితిన్ హీరోగా నటించిన ‘సై’సినిమాలో కోచ్‌గా రగ్బీ కోచ్‌గా రాజీవ్ కనకాల నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్‌లో నితిన్ టీమ్ ఓడిపోతుంటే.. రాజీవ్ ఓ భారీ డైలాగ్ చెప్పి వారికి ధైర్యాన్ని అందిస్తాడు. తాజాగా ఆ డైలాగ్‌ని సుమ అచ్చు గుద్దినట్లు చెప్పింది. అందరు ధైర్యంగా ఉండాలి.. ఎప్పుడైతే భయపడతామో మనలోని ఇమ్యూనిటీ శక్తి తగ్గిపోతుంది. భయపడకుండా ఉండాలంటే.. మంచి విషయాలు వినండి, భయపెట్టే వాటిని చూడకండని’ అంటూ ఫ్యాన్స్‌కి సలహా ఇచ్చింది సుమ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment