
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ నాల్గో సీజస్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ బిగ్ రియాల్టీ షోకి ఆదరణ తగ్గినప్పుడల్లా వైల్డ్‌కార్డు ఎంట్రీలను పంపి టీఆర్పీ రేటింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు. ఇలా ఇప్పటికే ముగ్గురు వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇవ్వగా.. వారిలో కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ తక్కువ రోజులకే బయటకు వచ్చారు. మరో వైల్డ్‌కార్డు ఎంట్రీ అవినాష్ మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే షోని మరింత రసవత్తరంగా మార్చే పనిలో పడ్డారు బిగ్‌బాస్ నిర్వాహకులు. ఈ సారి ప్రముఖ యాంకర్ సుమ కనకాలను బిగ్‌బాస్‌లోకి వైల్డ్‌కార్డు ఎంట్రీ ద్వారా పంపిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసింది స్టార్‌మా. ప్రోమోలో సుమ తన సూట్ కేసుతో ప్రత్యేక్షం అయ్యింది.
(చదవండి : బిగ్‌బాస్: క్లాసిక్ లుక్ వెనుక బాస్ బ్యూటీ!)
వైల్డ్‌కార్డ్ ఎంట్రీకి ఎలా ఒప్పుకున్నావ్ సుమా అని నాగార్జున అడగ్గా.. ‘ఏం చెయ్యాలి సర్.. పాండమిక్ చాలా మార్పులు తీసుకొచ్చింది.. అందుకే ఇంట్లోకి వచ్చాను’ సుమ చెప్పుకొచ్చారు. ఇక హౌస్‌మేట్స్ పాలిట నేను వైల్డ్‌కార్డు అవ్వబోతున్నానను అంటూ తనదైన శైలీలో చెప్పి గంతులేశారు. అలాగే తనదైన పంచులతో హౌస్‌మేట్స్‌తో పాటు నాగార్జునను ఓ ఆట ఆడుకుంది. ఇక సుమ వైల్డ్ కార్డు ఎంట్రీతో తనకు రానున్న ఐదు వారాలు ఫుల్ ఫన్ ఉంటుందని నాగ్ తెలిపారు. అంతేకాదు సుమను లోపలికి పంపిస్తున్నట్లు కూడా ప్రోమోలో చూపించారు.
(చదవండి : సమంత శారీ, జ్యువెలరీ ఖరీదు ఎంతో తెలుసా)
అయితే ఇదంతా నిజమా లేదా ఏమైనా ట్విస్ట్ ఉండనుందా అనేది తెలియరాలేదు. ప్రస్తుతం బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో తొమ్మిదవ వారం నడుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ సగం రోజుల్నీ పూర్తి చేసుకుంది. ఇప్పుడు హౌజ్ లోకి సుమ ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే హౌస్‌లోకి మరో వైల్డ్‌కార్డు ఎంట్రీ ఉంటుందని కొద్దిరోజులుగా ఊహాగానాలు వచ్చినప్పటికీ.. యాంకర్ సుమ వస్తారని ఎవరూ ఊహించలేదు. నాల్గో వైల్డ్‌కార్డు ఎంట్రీగా సింగర్ మంగ్లీ వస్తుందని పుకార్లు వచ్చాయి కానీ.. సుమ ఎంట్రీతో అది ఒట్టి పుకారే అని తేలిపోయింది. అయితే సుమ ఎంట్రీని కూడా నమశక్యంగా లేదు. ఏదో బిగ్‌ట్విస్ట్ ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఒకవేళా కనుక సుమ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌజ్’లోక ఎంట్రీ ఇస్తే ఓ రేంజ్‌లో ఉంటుంది షో.. అని చెప్పవచ్చు. సుమ ఎంట్రీతో ప్రేక్షకులకు మరింత కిక్ అందనుంది.
Comments
Please login to add a commentAdd a comment