
Anchor Suma Hilarious Fun With RRR Team: ఆర్‌ఆర్‌ఆర్ (మార్చి 25).. ప్రపంచ దేశాల తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఆ తేదీ దగ్గర పడుతోంది. దీంతో మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఆర్‌ఆర్‌ఆర్ హీరోలు, దర్శకుడు ఓ రేంజ్‌లో మూవీని ప్రమోట్ చేస్తున్నారు. విదేశాల్లో సైతం ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్ ఈవెంట్స్‌ను నిర్వహించారు. ఇక కొద్ది రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిలు వరసగా ఇంటర్య్వూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం యాంకర్ సుమతో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిలు ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు.
చదవండి: జీవితమంతా అంధకారమే: ప్రణీత షాకింగ్ కామెంట్స్
ఈ సందర్భంగా సుమ వారిని ఓ ఆటాడేసుకుంది. ఆర్‌ఆర్‌ఆర్ విడుదలపై వచ్చిన రకరకాల మీమ్స్ చూపిస్తూ సుమ రచ్చ రచ్చ చేసింది. అలాగే తారక్ కూడా సుమను ముసలమ్మ, నీకు నోరు పారేసుకునే గయ్యాలి అత్త పాత్రలు సెట్ అవుతాయంటూ ఆటపట్టించాడు. ఒకప్పుడు మనకి నిర్మలమ్మ గారు ఉన్నారు, కానీ ఈ రోజు లేరు. ఛాయాదేవి గారు, సూర్య కాంతం గారు, నిర్మలమ్మ గారు.. ఇప్పుడు వారి లోటు తీర్చేందుకు యాంకర్ సుమ సెట్ అవుతుందని కీరవాణి ఇంటర్య్వూలో చెప్పానన్నాడు.
చదవండి: అందుకే ఫిలిం మేకర్‌గా నేను ఫెయిల్యూర్: రాజమౌళి షాకింగ్ కామెంట్స్
అంతేగాక సుమ గయ్యాలి అత్త పాత్ర చేస్తే అదే సినిమాలో రాజీవ్ కూడా ఉండాలని, కాకపోతే నోరు పడిపోయిన మొగుడు రోల్ చేయాలంటూ సెటైర్లు వేశాడు. దానికి సుమ కూడా ఆహా రాజా వినడానికి ఇది ఎంత బాగుందో అంటూ ఎంజాయ్ చేసింది. అంతేగాక ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ సెట్‌లో తారక్, చరణ్‌ల అల్లరి, మూవీపై వస్తున్న మీమ్స్‌పై వారితో చర్చించింది. ఈ క్రమంలో వారి మధ్య చోటు చేసుకున్న సరదా సన్నివేశాలతో ఇంటర్య్వూలో మొత్తం ఆసక్తిగా సాగింది. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు చోటు చేసుకున్న ఈ ఫుల్ ఇంటర్య్వూను ఇక్కడ చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment