
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. స్పై క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ ఒక గూఢచారిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఏజెంట్ షూటింగ్ హైదరాబాద్ మెట్రోలో జరుగుతోంది. ఓ సాంగ్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ని ఇందులో చిత్రీకరిస్తున్నారని టాక్. మెట్రోలో అఖిల్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ మూవీలో ఏజెంట్ సినిమాలో అఖిల్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. దీని కోసం భారీ వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేశాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో అఖిల్ ట్రాన్స్ఫర్మేషన్‌కి అందరూ షాక్ అయ్యారు. ఈ లుక్ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఏజెంట్ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ లేదా టీజర్ వస్తుందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ బర్త్ డే ట్రీట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఏజెంట్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీతో అఖిల్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టాలనుకుంటున్నాడట. ఇకపై వరుసగా పాన్ ఇండియా చిత్రాలను ఎంచుకోవాలని అఖిల్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఏజెంట్ విడుదల తర్వాత.. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూసి.. తదుపరి సినిమాను ఎంచుకోవాలని భావిస్తున్నాడట. మరి అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఏజెంట్‌లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండగా.. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఏజెంట్ చిత్రాన్ని 2022 ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారట.
Comments
Please login to add a commentAdd a comment