
ఇప్పటివరకూ లవర్‌బాయ్‌గా కనిపించిన అఖిల్ ఏజెంట్ అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్‌గా కనిపించనుండగా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్యపాత్రలో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఆగస్టు 12 ఏజెంట్ విడుదల చేస్తున్నామంటూ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఎట్టకేలకు రిలీజ్ డేట్ వెల్లడించడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సినిమా కోసం దాదాపు ఏడాదిపాటు కష్టపడి అఖిల్ మేకోవర్ అయ్యారు. ఇందులో యంగ్ హీరో సిక్స్‌ప్యాక్ లుక్‌లో కనిపిస్తాడు. ఈ సినిమాకు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
An Action Spectacle awaits you in theatres 😎
— AK Entertainments (@AKentsOfficial) March 11, 2022
THE WILD ONE🤙🏻#AGENT⚡️ Reporting in theatres from AUGUST 12th 2022 💥💥💥#AGENTonAugust12 🔥@AkhilAkkineni8 @mammukka @DirSurender @AnilSunkara1 @hiphoptamizha @VamsiVakkantham@AKentsOfficial @S2C_Offl pic.twitter.com/lHKDvNwGjC
Comments
Please login to add a commentAdd a comment