వైజాగ్‌లో ఏజెంట్‌ | Akhil Akkineni Look in Agent | Sakshi
Sakshi News home page

వైజాగ్‌లో ఏజెంట్‌

Published Mon, Apr 11 2022 5:39 AM | Last Updated on Mon, Apr 11 2022 5:39 AM

Akhil Akkineni Look in Agent - Sakshi

ప్రత్యర్థుల ప్లాన్‌ను తిప్పి కొట్టడానికి వ్యూహం పన్నారు ఏజెంట్‌. మరి.. ఈ వ్యూహంలో ప్రత్యర్థులు చిక్కుకుని ఎలా అల్లాడిపోయారు? అనేది థియేటర్స్‌లో చూడాల్సిందే. అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఏజెంట్‌’. సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మమ్ముట్టి ఓ కీలక పాత్రధారి. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, సురేందర్‌ 2 సినిమా బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ కోసం అఖిల్‌ వైజాగ్‌ వెళ్లారు. అక్కడ ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను ప్లాన్‌ చేశారని, ఈ బ్లాక్‌ ఇంట్రవెల్‌లో వస్తుందని టాక్‌. ‘ఏజెంట్‌’ సినిమాను ఆగస్టు 12న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement